టీమిండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి వన్డే పరాభవం గురించి మరువక ముందే రెండో వన్డోలో కూడా భారత్ తడబడిందనే చెప్పాలి. ఎందుకంటే 19 ఓవర్లో 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగారు. తొలుత విజృంభించిన భారత బౌలర్లు ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేశారు. 26 ఓవర్లపాటు ఒక్క వికెట్ తీయలేకపోయారు. మరోవైపు బంగ్లా బ్యాటర్లు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. టాప్ జట్టు అని కీర్తించబడే టీమిండియా జట్టు నుంచి ఇలాంటి పేలవ ప్రదర్శనను ఎవరూ కోరుకోరు. టీమిండియా బౌలర్లను బంగ్లాదేశ్ ప్లేయర్ మెహిదీ హసన్ మరోసారి నవ్వులపాలు అయ్యేలా చేశాడు.
బంగ్లాదేశ్ టెయిలెండర్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. వారి పోరాటపటిమను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. మిడిలార్డర్‌లో వచ్చిన మహ్మదుల్లా, బౌలింగ్ ఆల్రౌండర్ అయన మెహిదీ హసన్ మరోసారి చెలరేగారు. మహ్మదుల్లా అయితే 20 ఓవర్లపాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. అతను 96 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. 47వ ఓవర్లో ఉమ్రాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తొలి ఇన్నింగ్స్ హీరోగా ఒకే ఒక పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతనెవరో కాదు.. బంగ్లాదేశ్ బౌలింగ్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ గురించే. ఎందుకంటే అతను ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా బౌలర్లను దాటిగా ఎదుర్కొన్నాడు.
Innings Break!
Bangladesh post a total of 271/7 on the board.
Three wickets for Washington and two wickets apiece for Umran Malik and Siraj.
Scorecard – https://t.co/e8tBEGspdJ #BANvIND pic.twitter.com/B1hyZOdMas
— BCCI (@BCCI) December 7, 2022
ఒకరకంగా చూసుకుంటే బంగ్లాదేశ్ బౌలింగ్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ టీమిండియా బౌలర్లను ఛాలెంజ్ చేస్తున్నాడనే చెప్పాలి. ప్రతిసారి బౌలింగ్ ఆల్రౌండర్ ఎందుకు అంటున్నాను అంటే.. ఒక బౌలింగ్ ఆల్రౌండర్‌తో మన బౌలర్లు సెంచరీ కొట్టించారనే విషయాన్ని బలంగా చెప్పేందుకే ఇలా అంటున్నాం. తొలి మ్యాచ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది కూడా ఈ మెహిదీ హసనే. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మరింత చెలరేగి ఆడాడు. కేవలం 83 బంతుల్లోనే 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచంలో టాప్‌క్లాస్ బౌలర్లను కలిగిన ఇండియా కూడా అతడిని అడ్డుకోలేకపోవడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
WHAT. A. KNOCK 🔥
Mehidy Hasan Miraz brings up his maiden ODI century to help Bangladesh to a competitive total 💪#BANvIND | Scorecard 👉 https://t.co/A76VyZDXby pic.twitter.com/rYHU4n5iJr
— ICC (@ICC) December 7, 2022
అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. మెహిదీ హసన్‌ని పొగడటంలో ఏ తప్పూ లేదు. కానీ, అతడిని అడ్డుకోవడంలో విఫలమైన మన బౌలర్ల చేతకానితనం గురించే ఎక్కువ మాట్లాడుకోవాలని చెబుతున్నారు. టీమిండియాలో డెత్ ఓవర్ బౌలర్ లేడనే విషయం, మన బౌలింగ్‌లో డొల్లతనం మరోసారి రుజువైందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుసగా 19 ఓవర్లకే 6 వికెట్లు పడగొట్టిన బౌలర్లు టెయిలెండర్ల విషయంలో మాత్రం తేలిపోవడం ఎవరికీ అంతుపట్టని ప్రశ్న. టెయిలెండర్లతో సెంచరీ చేయించడం ఒక్క భారత బౌలర్లకే సాధ్యం అంటూ గతంలో ఎలా అయితే ఎద్దేవా చేసేవారో.. ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి మనం రుజువు చేసినట్లు అయ్యింది. మొత్తానికి ఇలా అయితే టీమిండియా వన్డే వరల్డ్ కప్ మీద కూడా ఆశలు వదులుకోవాల్సిందే.
Mehidy Hasan Miraz scores an incredible hundred 😍❤️#INDvsBAN #BANvIND pic.twitter.com/9iU3V2rGFO
— Cricket Master (@Master__Cricket) December 7, 2022