భారత్ చేతిలో తొలి రెండు టెస్టులు ఓడి.. దారుణ స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను రక్షించి గెలుపుబాట పట్టించేందుకు ఓ స్టార్ క్రికెటర్ ముందుకొచ్చాడు. అది కూడా ఒక్క పైసా తీసుకోకుండా చేస్తా అంటున్నాడు. మరి క్రికెట్ ఆస్ట్రేలియా అతని బంపరాఫర్‌ను స్వీకరిస్తుందా? లేదా..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. ట్రోఫీని వరుసగా నాలుగో సారి తమతోనే ఉంచుకోనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో లీడ్‌లో ఉన్న టీమిండియా ఇంకొక్క మ్యాచ్ గెలిచినా చాలు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్‌కు సగర్వంగా దూసుకెళ్లనుంది. అలాగే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఇండియాపైన కచ్చితంగా ఒక టెస్టు గెలవాలి లేదా కనీసం డ్రా అయినా చేసుకోవాలి. ఒక వేళ మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఆసీస్ ఓడిపోతే.. శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. లంక, కివీస్‌ను రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఓడిస్తే.. ఆసీస్ భారత్‌పై 0-4 తేడాతో ఓడితే.. భారత్-శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాతాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు భారత్ చేతిలో వైట్‌వాష్‌కు గురైతే.. అహానికి మారుపేరుగా ఉన్న ఆస్ట్రేలియన్ల పరువు గంగలో కలుస్తుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆస్ట్రేలియా ముందున్న దారి ఒక్కటే.. భారత గడ్డపై స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని కనీసం మిగిలిన రెండు టెస్టులను డ్రా చేసుకుంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే.. గడిచిన రెండు టెస్టులను పరిశీలించి చూస్తే.. ఆసీస్ మిగిలిన రెండు టెస్టులను డ్రా చేసుకోవడం అంత సులువు కాదు. స్పిన్ పిచ్‌లపై అశ్విన్, జడేజాలను ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాటర్లు ముప్పుతిప్పలు పడుతున్నారు. వారి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడితేనే ఆసీస్ మ్యాచ్‌లో నిలబడగలిగేది.
మరి టీమిండియా స్పిన్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొనే టెక్నిక్ ప్రస్తుత ఆసీస్ జట్టులోని క్రికెటర్లకు లేకపోవచ్చు కానీ, ఆసీస్ సీనియర్ క్రికెటర్ల వద్ద మాత్రం దీనికొక పరిష్కారం ఉంది. ఇప్పుడు అలాంటి టెక్నిక్‌నే ఆసీస్ బ్యాటర్లకు నేర్పించి టీమిండియా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా నేను చేస్తానంటూ.. ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ ఒకరు ముందుకొచ్చారు. అతనెవరో కాదు.. స్టార్ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియా తరఫున చాలా ఏళ్ల పాటు అద్భుతంగా ఆడిన హేడెన్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అలాగే ఇక్కడి పిచ్‌లపై కూడా అతనికి మంచి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌లో విఫలమవుతున్న ఆసీస్ బ్యాటర్లకు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దానికి కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తనకు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించాడు. కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై స్పందించలేదు. మరి ఆసీస్‌ను కాపాడేందుకు హేడెన్ తనకు తానే రంగంలోకి దిగాడు. మరి అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అవకాశం ఇస్తుందో లేడో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Matthew Hayden has offered to help the Aussie side bat better in India – free of charge! 😮#9WWOS #Cricket #AUSvIND pic.twitter.com/ABUulcxQyW
— Wide World of Sports (@wwos) February 21, 2023