ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ నడుస్తుంది. దీని ప్రభావం క్రికెట్‌పై కూడా భారీగానే పడింది. ఇప్పటికే మన దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ అధ్యక్షుడు కరోనా బారిన పడ్డారు. అలాగే యాషెస్ సిరీస్‌లో కూడా పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కరోనా సోకింది. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్‌వెల్ చికిత్స తీసుకుంటున్నాడు.
Unfortunately we’ve had to postpone tonight’s Heat v Sixers clash 😔
Strikers v Hurricanes will now start at 7:15PM AEDT ⏱ #BBL11 pic.twitter.com/W77tHZ5AQm
— KFC Big Bash League (@BBL) January 5, 2022
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్ ఈ లీగ్ సందర్బంగానే వైరస్ బారిన పడ్డాడు. మ్యాక్సీతో పాటు మరికొందరు కరోనా బారిన పడటంతో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. క్రికెటర్లకు కరోనా సోకడంతో లీగ్ పూర్తిగా వాయిదా పడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ కూడా కొన్ని మ్యాచ్‌లు జరిగిన తర్వాత వాయిదా పడి.. రెండో భాగం దుబాయ్‌లో జరిగిన విధంగానే బిగ్‌బాష్ లీగ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు రద్దు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.