సాధారణంగా క్రికెట్ లో ఏ ఒక్క ఆటగాడిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అదీకాక పలానా ఆటగాడు ఒక్క టెస్టులకే పనికొస్తాడనో లేక వన్డేలకు, టీ20లకు మాత్రమే పనికొస్తాడనో అంచనాకు రాకూడదు. అవకాశం రావాలే గానీ టెస్ట్ ఆటగాడు కూడా టీ20ల్లో చెలరేగుతాడు. ఇక టెస్ట్, వన్డే బ్యాటర్ గా ముద్ర పడిన ఆసిస్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో తన సత్తా చూపించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతూ.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే తన బిగ్ బాష్ లిగ్ లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. టెస్టు ఆటగాడు అని తనపై ఉన్న ముద్రకు ఈ సెంచరీతో సమాధానం ఇచ్చాడు.
స్టీవ్ స్మిత్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో స్టీవ్ స్మిత్ కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. పాంటింగ్ తర్వాత మళ్లీ అంతటి పేరు సంపాందించుకున్న ఆసిస్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది స్టీవ్ స్మిత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి గొప్ప ఆటగాడు అయినప్పటికీ టీ20ల్లో మాత్రం చోటు దక్కించుకోలేక పోతున్నాడు. దాంతో స్మిత్ కేవలం టెస్ట్ ఫార్మాట్ కే పనికొస్తాడని ముద్ర వేసింది. అయితే తనకు అవకాశం వస్తే.. టీ20ల్లో కూడా రాణిస్తానని ప్రకటించాడు స్మిత్. ఇక ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్మిత్.. తాజాగా జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు.
Steve Smith’s maiden BBL 💯 is also the first BBL ton by a Sydney Sixers player 😮 #BBL12
— ESPNcricinfo (@ESPNcricinfo) January 17, 2023
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా తాజాగా మంగళ వారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్నే చూపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మిత్.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ లోనే మరో ఓపెనర్ జోష్ ఫిలిఫ్(1) పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ స్మిత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మరో టాపార్డర్ బ్యాటర్ కుర్టిస్ ప్యాటర్సన్(43) తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు స్మిత్. ఈ క్రమంలోనే సిడ్నీ సిక్సర్స్ తరపున లీగ్ లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో స్మిత్ 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. చివర్లో జోర్డాన్ సిల్స్ 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్టీవ్ స్మిత్ సునామీ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. మరి టెస్ట్ బ్యాటర్ గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ చేసిన ఈ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.