ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌలర్లపై వీరవిహారం చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శనివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ విశ్వరూపం చూపించాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న స్టోయినీస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. చిచ్చరపిడుగులా చెలరేగాడు. స్టోయినీస్ పిచ్చికొట్టుడు కొడుతుంటే.. బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాక అడిలైడ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. స్టోయినీస్ బాదుడికి.. మెల్బోర్న్ స్టార్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన మెల్బోర్న్ 186 పరుగులు చేసింది. స్టోయినీస్ తుఫాన్ ఇన్నింగ్స్‌తోనే ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్కు స్టోయినీస్ న్యాయం చేశాడు.
70 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినీస్.. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ పీటర్ సిడిల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో దుమ్ముదుమారం చేశాడు. వరుసగా 6,4,4,0,6,4తో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. అలాగే.. హెన్రీ థోర్న్టన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మరోసారి తన పవర్ హిట్టింగ్ పవరేంటో చూపించాడు. స్టోయినీస్ విధ్వంసానికి ఈ సారి హెన్రీ బలయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతిని నిక్ సింగిల్ తీసి స్ట్రైక్‌ను స్టోయినీస్కి ఇచ్చాడు. ఆ తర్వాత స్టోయినీస్ చెలరేగిపోయాడు. చివరి ఐదు బంతుల్లో.. 6,6,6,4,6 తో దుమ్ములేపాడు.
ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. దీంతో అప్పటి వరకు ఓ మోస్తారు స్కోర్ చేస్తుందని భావించిన మెల్బోర్న్ 18 ఓవర్లు ముగిసే సరికే 169 పరుగులు పూర్తి చేసుకుంది. ఇక చివరి రెండు ఓవర్లలో కూడా సిక్సుల వర్షం ఖాయంగా కనిపించింది. కానీ.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వెస్ అగర్ తొలి బంతికే స్టోయినీస్‌ను అవుట్ చేసి.. మెల్బోర్న్ 200 మార్క్ దాటకుండా అడ్డుకున్నాడు. ఆ ఓవర్లో అగర్ లుకీ వుడ్‌ను సైతం అవుట్‌చేశాడు. అలాగే ఐదో బంతికి థోమస్ కెల్లీ సైతం రనౌట్ అయ్యాడు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టోయినీస్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 74 పరుగులతో రాణించాడు. అతనితోపాటు ఓపెనర్ జో క్లార్క్ 42, మరో ఓపెనర్ థామస్ రోజర్ 30 పరుగులతో రాణించారు. దీంతో మెల్బోర్న్ 20 ఓవర్లలో 186 పరుగులు చేసి.. అడిలైడ్ ముందు 187 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. మరి ఈ మ్యాచ్‌లో స్టోయినీస్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
4 sixes in an over by Marcus Stoinis. pic.twitter.com/R7auElc1fx
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2022
Marcus Stoinis – The Hulk is back!#MelbourneStars #MarcusStoinis #MSvsAS #BBL12 #CricTracker pic.twitter.com/sTqTqCpmyb
— CricTracker (@Cricketracker) December 31, 2022