ఓ దేశం 36 ఏళ్ల నిరీక్షణ.. ఓ యోధుడి పోరాటం.. కలగలిసి ఆ దేశ నిరీక్షణకు తెరదించాయి. ఈ అఖండమైన విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు అశేషమైన ఘన స్వాగతం పలికారు అర్జెంటీనా అభిమానులు. ఫీఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 గెలుచుకుని వస్తున్న ఆటగాళ్లకు సొంత గడ్డపై అడుగుపెట్టగానే అశేషజనవాహిని వారికి స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనాలే.. ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా కొనసాగిన ఈ విజయోత్సవ రాలీలో అర్జెంటీనా జట్టుకు పెను ప్రమాదమే తప్పింది. దాంతో మెస్సీ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ లో తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలుచుకుని స్వదేశంలో అడుగుపెట్టిన అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు ఆదేశ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అర్జెంటీనా రాజధాని నగరం అయిన బ్యూనస్ ఎయిర్ కు పక్కనున్న ఇజీజా ఎయిర్ పోర్ట్ కు మెస్సీ జట్టు ప్రపంచ కప్ తో చేరుకుంది. అక్కడి నుంచి ఆటగాళ్లు అభిమానుల కోసం ఓపెన్ టాప్ బస్సులో ప్రయాణించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలోనే విజయోత్సవ ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగుతున్న క్రమంలో.. దారి మధ్యలో మెస్సీ, రోడ్రిగో, నికోలస్ ఒటామెండి, లియాండ్రో, డి మారియాలు బస్సుపై కూర్చున్నారు. అయితే అనుకోకుండా వారికి ఓ కరెంట్ వైర్ అడ్డుగా వచ్చింది. దానిని గమనించిన ఆటగాళ్లు చాకచక్యంగా కిందికి వంగారు. దాంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వంగే క్రమంలో కరెంట్ వైర్ తగిలి ఓ ఆటగాడి క్యాప్ పడిపోయింది. అనంతరం బస్సులో కూర్చున్న ఆటగాళ్లను కలుసుకోవడానికి అభిమానులు పోటెత్తడంతో.. మెస్సీతో సహా మిగిలిన ఆటగాళ్లను హెలికాప్టర్లో తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Argentina get their heroes home but nearly clothesline them off the bus.pic.twitter.com/hemkogABq2
— Football España (@footballespana_) December 20, 2022