తనపై రోహిత్ శర్మ ఎంత నమ్మకం ఉంచాడో.. స్వయంగా కేఎస్ భరతే తెలిపాడు. తెలుగు క్రికెటర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. రెండు మ్యాచ్‌లతోనే కెప్టెన్‌కు నమ్మిన బంటుగా మారిపోయాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్లపై ఎలాంటి నమ్మకం ఉంచుతాడో, యువ ఆటగాళ్లకు ఎలాంటి ధైర్యం, భరోసా ఇస్తాడో యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన భరత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌లోక అరంగేట్రం చేసిన భరత్.. తొలి రెండు టెస్టుల్లో బ్యాటర్‌గా పెద్దగా రాణించకపోయినా.. వికెట్ కీపర్‌గా మాత్రం ప్రశంసలు అందుకున్నాడు. మెరుపు క్యాచ్‌లు, స్టంప్ అవుట్లు చేసి శభాష్ అనిపించుకున్నాడు.
అలాగే.. ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకునే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు, బౌలర్లకు మంచి సలహాలు ఇస్తూ.. రోహిత్‌కు దగ్గరయ్యాడు. లెగ్ బిఫోర్ కోసం రివ్యూ తీసుకోవాలంటే రోహిత్ శర్మ అందరి కంటే ముందు చూసిది కేఎస్ భరత్ వైపే. అతనైతే మంచిగా జడ్జ్ చేసి చెప్తాడనే నమ్మకం రోహిత్‌కు వచ్చేసింది. గతంలో రిషభ్ పంత్, దినేష్ కార్తీక్‌లు వికెట్ కీపర్లుగా ఉన్న సమయంలో వారి జడ్జిమెంట్‌పై రోహిత్ అంతగా నమ్మకం ఉంచేవాడు కాదు. రివ్యూ చర్చల్లో వారిపై పలుసార్లు రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం రెండు టెస్టుల మాత్రమే ఆడిన భరత్ మాత్రం రోహిత్‌కు నమ్మిన బంటులా మారిపోయాడు.
ఈ విషయం గురించి కేఎస్ భరత్ మీడియాతో మాట్లాడుతూ..‘రోహిత్ భాయ్.. డీఆర్‌ఎస్ విషయంలో నేను బాగా జడ్జ్ చేస్తానని చెప్పారు. వికెట్ కీపర్‌గా నువ్వే బ్యాటర్‌కు చాలా క్లోజ్‌గా ఉంటావు. దీంతో నువ్వు రివ్యూ టైమ్‌లో నువ్వు ఏం ఫీలైనా అది చెప్పేసెయ్.. అది రైట్ అయినా, రాంగ్ అయినా పట్టించుకోవద్దు అని భరోసా ఇచ్చాడు. రోహిత్ భాయ్ అలా చెప్పడంతో ఒత్తిడి తగ్గి ఫ్రీగా ఫీల్ అయ్యాను.’ అని భరత్ పేర్కొన్నాడు. అయితే.. కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న ఆటగాడిపై రోహిత్ శర్మ ఇంత నమ్మకం ఉంచి, ఒత్తిడి లేకుండా నిర్ణయం తప్పైనా ఏం పర్వాలేదని అతనికి భరోసా కల్పించడంపై క్రికెట్ అభిమానులు రోహిత్‌పై ప్రశసంలు కురిపిస్తున్నారు. అందులోనే తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అయితే హ్యాట్సాఫ్ రోహిత్ శర్మ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి రోహిత్ శర్మ గురించి భరత్ చెప్పిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Talk about enjoying your captain’s backing on DRS calls! 👌 👌
🗣️ Hear what wicketkeeper @KonaBharat had to say about #TeamIndia captain @ImRo45 #INDvAUS | @mastercardindia pic.twitter.com/5EYERpUKIa
— BCCI (@BCCI) February 27, 2023