టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.. ఆస్ట్రేలియా ఓపెనర్‌ను కొట్టాడు. తొలి రోజు నుంచి అవుట్ కాకుండా బ్యాటింగ్ చేస్తూ.. సెంచరీ పూర్తి చేసుకున్న ఖవాజాపై భరత్ ఈ విధంగా కోపం ప్రదర్శించాడు.
అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి ఆస్ట్రేలియా రెండో రోజు లంచ్ సమయానికి మరో వికెట్ కోల్పోకుండా 347 పరుగులకు చేరుకుంది. తొలి రోజు సెంచరీతో అదరగొట్టిన ఉస్మాన్ ఖవాజా.. రెండో రోజు 150 మార్క్‌ను అందుకున్నాడు. అతనితో పాటు కామెరున్ గ్రీన్ సైతం సెంచరీకి చేరువయ్యాడు. 170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 4వ వికెట్ కోల్పోయిన తర్వాత.. మళ్లీ వికెట్ పడకుండా 347 పరుగులు సాధించింది. ఖవాజా-గ్రీన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నమోదైంది. మరి ఈ జోడీ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఈ టెస్టు గెలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరాలంటే భారత్ కచ్చితంగా నాలుగో టెస్టులో విజయం సాధించి తీరాల్సిందే. లేదంటే.. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ఫలితంపై ఆధారపడాలి.
ఇంత కీలక టెస్టులో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఖవాజా కొరకరాని కొయ్యగా మారాడు. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. అద్భుతంగా ఆడుతున్నాడు. సాలిడ్ డిఫెన్స్‌తో అశ్విన్, జడేజాలకు విసుగుతెప్పిస్తున్నాడు. చెత్త బంతి పడ్డప్పుడు తప్పితే.. షాట్ల జోలికే పోవడం లేదు. నిన్నటి నుంచి బ్యాటింగ్ చేస్తున్న ఖవాజా.. ఒక్కటంటే ఒక్క తప్పు కూడా చేయకపోవడం విశేషం. ఇప్పటి వరకు 354 బంతుల్లో 20 ఫోర్లతో 150 పరుగులు చేశాడు. లంచ్ తర్వాత కూడా తన బ్యాటింగ్‌ను కొనసాగించనున్నాడు. అతనికి కామెరున్ గ్రీన్ కూడా అద్భుతంగా జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 177 రన్స్ జోడించారు. గ్రీన్ 135 బంతుల్లో 15 ఫోర్లతో 95 రన్స్ చేసి.. సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే.. భారత బౌలర్లను ఖవాజా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు. బాల్‌ను అడ్డంగా డిఫెన్స్ ఆడుతూ.. ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు.
ఖవాజా బ్యాటింగ్‌తో బౌలర్లే కాకుండా మిగతా ఫీల్డర్లు సైతం విసిగిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.. ఖవాజాను బాల్ తీసుకొని కొట్టాడు. షమీ బౌలింగ్‌లో డెడ్లీ బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో ఖవాజా కిందపడిపోయాడు. తిరిగి లేస్తున్న క్రమంలో ఖవాజా క్రీజ్ బయటికి వెళ్లి ఉంటాడని అనుకున్న భరత్.. బాల్‌ను వికెట్లకు త్రో వేశాడు. అది కాస్త మిస్ ఫైర్ అయి.. నేరుగా వెళ్లి ఖవాజా కాలికి తగిలింది. బాల్ దెబ్బను ఊహించని ఖవాజా షాక్ అవుతూ.. భరత్ వైపు చూశాడు. కావాలని కొట్టలేదని భరత్ నవ్వుతూ సారీ చెప్పడంతో ఖవాజా సైతం చిరునవ్వుతో ప్రతిస్పందించాడు. అయితే.. స్లిప్‌లో ఫీల్డంగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. భరత్ ఎందుకు త్రో కొట్టాడో అర్థం కాక షాక్ అవుతూ భరత్ వైపు చూశాడు. ఇలాంటివి అవసరమా అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం భరత్ వైపు అలా చూస్తూ నిలబడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖవాజా ఎంతకూ అవుట్ కాకపోవడంతో విసుగెత్తిపోయిన భరత్.. ఇలా కొట్టి పెవిలియన్‌కు పంపుదామని ప్లాన్ వేశాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— MAHARAJ JI (@MAHARAJ96620593) March 9, 2023