బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు వినగానే ఆట కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయేమో? ఈ ఏడాది జరుగుతున్న లీగ్ లో వెలుగు చూస్తున్న వివాదాలు, సంఘటనలు చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఒక్కరోజే జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.. వీళ్ల గురించి ఎప్పుడూ ఏదో రకంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అది టకు సంబంధించి అనుకునేరు.. అలా అయితే మీరు నో బాల్ లో క్యాచ్ పట్టి అప్పీల్ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే ఘటనలు అలా ఉంటాయి మరి. ఎప్పుడు ఏదో వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అలా ఆకర్షించడమే కాదు.. అందరితో చీవాట్లు కూడా తింటుంటారు. అలాంటి ఒక ఘటన తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో వెలుగు చూసింది. ఒక జట్టు కోచ్ చేసిన పని మొత్తం ఆ లీగ్ కే చెడ్డ పేరు తీసుకొచ్చింది. క్రికెట్ అంటే మీకున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తేలా చేసింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రేమియర్ లీగ్-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ మ్యాచ్ లో శుక్రవారం రాత్రి ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక వింత ఘటన జరిగింది. అదేంటంటే.. మ్యాచ్ జరుగుతండగా కరెంట్ పోయింది. ఒక్కసారిగా స్టేడియం మొత్తం చీకటి కమ్మేసింది. ఒక క్రికెట్ మ్యాచ్ లో ఇలాంటి ఘటన జరగడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఆ ఘటన విషయంలో సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ని ఏకిపారేశారు. అదే మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది.
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. అదేంటంటే.. ఫార్చ్యూన్ బరిషల్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఖుల్నా టైగర్స్ కోచ్ ఖలీద్ మహ్మద్ సుజోన్ సిగిరెట్ తాగుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన తర్వాత నెటిజనులు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మరింత అసహ్యించుకుంటున్నారు. ఇదేనా మీ క్రీడాస్ఫూర్తి? మ్యాచ్ జరుగుతుంటే డగౌట్ లో కూర్చొని ఒక కోచ్ దూమపానం చేయడం ఏంటి? అంటూ ఘాటు ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు అతను ఒక క్రికెటర్ ఎలా అయ్యాడు? ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లోనే సాధ్యమవుతాయిలో అంటూ కామెంట్ చేస్తున్నారు.
Khulna Tigers head coach Khaled Mahmud smoking during the match in BPL tonight.#BPL2023 #INDvsAUS pic.twitter.com/0kcRQJ2ONm
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 10, 2023