క్రికెట్.. చూడటానికి మంచి వినోదాన్ని పంచే క్రీడ. కానీ.., గ్రౌండ్ లో ఆడేవాళ్ళకి మాత్రం ఒత్తిడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ టెన్షన్ తట్టుకోలేక చాలా మంది క్రికెటర్స్ ఆటకి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ట్రెస్కోథిక్ ఇలా టెన్షన్ భరించలేక ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్నాడు. మరో ఇంగ్లీష్ బాట్స్మెన్ ట్రాట్ కథ కూడా ఇదే. ఇక మొన్నటికి మొన్న స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆట నుండి విరామం కోరుతూ పక్కకి తప్పుకున్నాడు. స్టోక్స్ రెస్ట్ ఎప్పటి వరకు అన్నది క్లారిటీ లేదు. వరల్డ్ కప్ కి అయినా అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. కట్ చేస్తే.., ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ.., న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఆటకి దూరం కాబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ క్రికెట్ లో న్యూజిలాండ్ ఇప్పుడు ఓ శక్తివంతమైన టీమ్. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో దురదృష్టం కొద్దీ కప్ చేజార్చుకుంది. కానీ.., టెస్ట్ ఛాంపియన్ గా అవతరించింది. ఇన్ని విజయాల వెనక కీలక పాత్ర పోషించింది కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనేది ఎవరైనా ఒప్పుకునే సత్యం. అయితే.., ఈ సుదీర్ఘ ప్రయాణంలో విలియమ్సన్ కి రెస్ట్ లేకుండా పోయింది. కేన్ మామ అన్నీ ఫార్మేట్లలో జట్టుని ముందుండి నడిపించాలి. దీనితో.., మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యాడట. దీంతో.., కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రికెట్ నుండి కొన్ని రోజులు తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే.., ఈ విరామం ఎప్పటి వరకు అన్నది ఇంకా తెలియ రాలేదు. ప్రస్తుతం విలియమ్సన్ వయసు 30 సంవత్సరాలు మాత్రమే. దీంతో.., కొంత విరామం తరువాత మళ్ళీ కేన్ మామ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఐపీఎల్ లో విలియమ్సన్ సన్ రైజర్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. మరి.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ విరామం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.