Kane Williamson: కేన్ మామ తొలి మ్యాచ్‌లోనే గాయపడి ఐపీఎల్‌కు దూరం కావడంతో అతని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా వన్డే వరల్డ్ కప్ వరకు బ్యాట్ పట్టే వీలు లేదనే విషయం తెలిసి.. ఎమోషనల్ అవుతున్నారు. కేన్ మామకు అంత తీవ్ర గాయమైందా?..
ఐపీఎల్.. ప్రతి ఏడాది క్రికెట్ అభిమానులకు 50 రోజులకు పైగా నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ధనాధన్ లీగ్. అలాగే ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించే రీచ్ లీగ్. ఒక్కసారి ఐపీఎల్‌లో మెరిస్తే వారి దశ తిరిగిపోయినట్లే.. అలాగే వ్యాపార సంస్థలకు భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఒక బంగారు బాతు. ఇలా అన్ని మెరుపులు మాత్రమే కనిపించే ఐపీఎల్‌లో ఒక చీకటి కోణం కూడా ఉంది. అదే ఆటగాళ్ల గాయాలు. రెండు నెలల పాటు మ్యాచ్‌లని, ప్రాక్టీస్‌లని ఎడతెరిపిలేకుండా క్రికెట్ ఆడటంతో ఆటగాళ్లు గాయపడుతుంటారు. కొన్ని సార్లు అవి చాలా తీవ్రంగా మారుతాయి. ఎంతలా అంటే వారి కెరీర్‌నే ప్రమాదంలో పడేసి, వారి జాతీయ జట్టును బలహీన పరిచేంత తీవ్రంగా మారుతాయి. ఇప్పుడు న్యూజిలాండ్‌కు, కేన్ విలియమ్సన్‌కు అదే జరిగింది.
చాలా కాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్న విలియమ్సన్.. ఈ సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయడంతో.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కేన్ రాకతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న గుజరాత్ మరింత బలపడిందని క్రికెట్ విశ్లేషకులు సైతం భావించారు. అలాగే గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ తుది జట్టులో ఉన్నాడు. అయితే బౌండరీ లైన్ వద్ద భారీ సిక్స్‌ను ఆపే ప్రయత్నంలో కేన్ మామ గాయపడ్డాడు. అతని మోకాలు వద్ద గాయం కావడంతో.. గ్రౌండ్ నుంచి ఇద్దరు వ్యక్తులు భుజాలపై అతన్ని బయటికి తీసుకెళ్లారు.
ప్రాథమిక చికిత్స తర్వాత ఇక ఐపీఎల్ మొత్తం దూరమైన విలియమ్సన్.. స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే.. ఎయిర్ పోర్టులో రెండు సంకల్లో రెండు కర్రలు, కుడి కాలికి పెద్ద కట్టుతో కేన్ మామ నడుచుకుని వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూపి క్రికెట్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అయితే.. స్వదేశం వెళ్లి పూర్తి స్థాయిలో స్కానింగ్ తీసిన తర్వాత.. మోకాలికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. సర్జరీ కనుక చేయించుకుంటే.. కేన్ మామ చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు విలియమ్సన్ దూరం అవ్వడం ఖాయం. అతను లేకుంటే న్యూజిలాండ్ బలహీనపడతుంది. మరి ఐపీఎల్ కోసం చూసుకుంటే ఇప్పుడు వరల్డ్ కప్‌కే దూరం కావాల్సి రావడంపై క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Painful to see Kane Williamson in this situation!
Wishing him a speedy recovery. pic.twitter.com/cngFRlQiyg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2023
Kane Williamson, New Zealand’s ODI captain, has been diagnosed with a ruptured anterior cruciate ligament in his right knee, the recovery timeline for which could see him miss the World Cup later this year.
Williamson will undergo surgery on his knee https://t.co/8mhkjy3hTT pic.twitter.com/6M8QxIZUl9
— ESPNcricinfo (@ESPNcricinfo) April 6, 2023