మన దేశంలో మన జట్టుపై టెస్టు సిరీస్ గెలవాలడం అంటే కాస్త కష్టంతో కూడిన విషయమే. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తామని ఆస్ట్రేలియా జట్టు ప్లాన్స్ వేసుకుంటోంది. ఎందుకంటే 2004లో చివరగా భారత పర్యటనలో టెస్టు సిరీస్ 2-1 కైవసం చేసుకున్న ఆసీస్ జట్టు.. ఆ తర్వాత జరిగిన గత నాలుగు పర్యటనల్లోనూ ఓడిపోయింది. అదే టైంలో 2015 నుంచి టీమిండియాపై ఒక్క టెస్టు సిరీస్ లోనూ విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం పరిమిత ఓవర్లు, టెస్టుల్లో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా కూడా తమ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలని పట్టుబట్టుకుని ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన దేశంలో ఆస్ట్రేలియా జట్టు పర్యనట ఫిబ్రవరి 9న నాగ్ పుర్ లో జరిగే టెస్టుతో ప్రారంభం కానుంది. ఈ టూర్ లో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేల్లో ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే దీనికోసం బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పక్కాగా ప్రిపేర్ అవుతున్న ఆసీస్ జట్టు.. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి నో చెప్పేసింది. అదే టైంలో అశ్విన్ లాంటి స్పిన్ బౌలింగ్ వేసే ఓ బౌలర్ తో తెగ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా మారింది. ఇలాంటి టైంలో తొలి టెస్టు ప్రారంభం కావడానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
ఫిబ్రవరి 9న జరగబోయే తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆడటం లేదు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. గత నెలలోనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ కోసం హేజిల్ వుడ్ ని జట్టులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పాదాల వెనక భాగంలో నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆలూర్ లో ఆసీస్ జట్టు ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ.. హేజిల్ వుడ్ మాత్రం బౌలింగ్ వేయలేకపోతున్నాడు. ఇప్పటికే స్టార్క్ గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు హేజిల్ వుడ్ కూడా తొలి టెస్టు నుంచి తప్పుకోవడం.. ఆసీస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇక స్టార్క్, హేజిల్ వుడ్ ఉండరు కాబట్టి.. పేస్ బౌలింగ్ బాధ్యతంతా కూడా స్కాట్ బోలండ్, లాన్స్ మోరిస్ తో కలిసి కెప్టెన్ పాట్ కమిన్స్ చూసుకోవాల్సి ఉంది. మరి హేజిల్ వుడ్ లాంటి కీ ప్లేయర్, గాయం వల్ల తప్పుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
🚨 Just in: Josh Hazlewood has been ruled out of the opening #INDvAUS Test due to injury pic.twitter.com/2zWG69lo0t
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2023