ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ జానీ బెయిర్‌స్టో ఎంతటి విధ్వంసపు బ్యాటరో మనందరికి తెలుసు. కానీ.. బెయిర్‌స్టో ఫిట్‌గా ఉండేందుకు ఎంత కఠినమైన వర్క్అవుట్లు చేస్తాడో మనకు తెలియదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో బెయిర్‌స్టో ఫిట్నెస్ లెవెల్స్‌ను, కండబలాన్ని తెలియజేస్తున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు బీస్ట్ బెయిర్‌స్టో అంటూ పేర్కొంటున్నారు.
జిమ్‌లో సామ్ కరన్‌ను బెయిర్‌స్టో అమాంతం ఎత్తుకుని భుజాలపై మోయడమే కాకుండా.. మోకాలిపై కూర్చోని మళ్లీ అలానే లేశాడు. నిజానికి ఒక మనిషి బరువును అలా భుజాలపై మోయడమే ఎక్కువ అనుకుంటే.. మోకాలిపై కూర్చోని పైకి లేవడం అంత సులువైన విషయం కాదు. అందుకే బెయిర్‌స్టో చేసిన ఈ ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బహుబలి బెయిర్‌స్టో, బీస్ట్ బెయిర్‌స్టో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా ఇటివల భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీతో గొడవ తర్వాత మరింత రెచ్చిపోయిన బెయిర్‌స్టో ఇంగ్లండ్‌కు ఒంటిచేత్తో విజయం అందించాడు. కానీ.. ఆ తర్వాత జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో బెయిర్‌స్టో పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు.. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. మరి బెయిర్‌స్టో కండబలం ప్రదర్శించిన వీడియోను చూపి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jonny Bairstow is built different 🏋🏻♂️
📹 via Reece Topley pic.twitter.com/85w2GutZpc
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2022