క్రికెట్ అంటేనే మజా..! అందులో టెస్టు, వన్డే, టీ20 అంటూ భేధాలుండవ్! ఫోర్, సిక్స్, వికెట్, నో బాల్.. ఇలా ఏది జరిగినా ప్రేక్షకులకు పండగే. అయితే.. రాను రాను క్రికెట్ లో చాలా మార్పులొచ్చాయి. ఈ మార్పుల కారణంగా.. టెస్టు క్రికెట్ పై ఆసక్తి తగ్గి.. పరిమిత ఓవర్ల మ్యాచ్ అంటే అభిమానులు ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్ల పెత్తనం కూడా ఎక్కువయ్యింది. బాల్ పడిందా.. బౌన్దరీ వెళ్లిందా అన్నట్లుగా సాగుతోంది. బౌలర్ కు ఏదో ఒక వైవిధ్యం ఉంటే బౌలింగ్ వేసే లక్షణం ఉంటే తప్ప బ్యాటర్ల ముందు నిలబడటం కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో.. ఒక బౌలర్ తెరమీదకు వచ్చాడు. తన ఇన్ స్వింగ్ బౌలింగ్ తో బ్యాటర్ ను మాయలో పడేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ లో.. బ్యాటర్లది కాస్త పైచేయిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్ పరిచయం అయ్యాక.. మొత్తం బ్యాటర్లదే పైచేయిగా మారిపోయింది. ఎన్ని ఓవర్లు మంచిగా వేసినా..ఏదో ఒక ఓవర్లు పరుగులు ఇవ్వడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో బ్యాట్సమెన్ ను కట్టడి చేయడం కోసం.. బౌలర్లు అహర్నిశలు కష్టపడుతున్నారు. మంచి పేస్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్.. ఇలా ఏదో ఒకరకంగా ప్రత్యేకంగా వేయగలిగితే తప్ప రాణించడం కష్టం. ఇలాంటి తరుణంలో.. ఇంగ్లాండ్ కు చెందిన ఓక వైవిధ్య బౌలర్ తెరమీదకు వచ్చాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ఒక క్లబ్ క్రికెట్ గేమ్‌లో, మిల్డెన్‌హాల్ క్రికెట్ క్లబ్ ఆటగాడు జోనా హ్యాండీ అద్భుతమైన ఇన్ స్వింగ్ డెలివరీతో ప్రత్యర్థి బ్యాటర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. “ఈ బ్యాటర్ ఒక్కడే కాదు.. సచిన్, కోహ్లీ, ధోని లాంటి దిగ్గజాలు సైతం ఈ బాల్ ఆడలేరు“.. అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Oh my word.
We’ve just been sent the delivery of the summer – look at the swing on that 🤯🔥
via @MildenhallCrick & @Frogboxlive pic.twitter.com/wvSKY7VfHo
— Cricket District 🏏 (@cricketdistrict) May 23, 2022
ఇది కూడా చదవండి: Sheethal Goutham: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న క్రికెటర్ రాబిన్ ఉతప్ప భార్య.. ఫోటోస్ వైరల్!