ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌కు దూరం కాగా.. మరో స్టార్ క్రికెటర్ సైతం ఐపీఎల్‌కు దూరం అయ్యాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బౌలర్, బౌలింగ్ ఎటాక్‌కు కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా వెన్నుముకకు సర్జరీ చేయించుకునేందుకు ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కాగా.. ఇప్పుడు బుమ్రా బాటలోనే మరో ప్లేయర్ కూడా నడుస్తున్నాడు. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ రిచర్డ్‌సన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. మోకాలికి సర్జరీ కోసం రిచర్డ్‌సన్ ఐపీఎల్‌కు దూరం అవుతున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది.
ఇప్పటికే ఐపీఎల్‌లో 5 టైటిల్స్‌సాధించి అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై.. గత సీజన్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబర్చింది. అలాంటి ప్రదర్శన నుంచి బయటపడి ఐపీఎల్ 2023 సీజన్‌లో సత్తా చాటాలని భావిస్తున్న ముంబైకి.. ఆటగాళ్లు గాయాల బెడద బాధిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కావడం ముంబై ఫ్రాంచైజ్‌ను కలవరపెడుతోంది. మరి వీరిద్దరి స్థానంలో ముంబై ఎవర్ని తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. టీమిండియా పేసర్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022తో పాటు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సైతం దూరమైన విషయం తెలిసిందే. అయితే.. మొన్నటి వరకు ఐపీఎల్‌లో బుమ్ర ఆడుతాడంటూ వార్తలు వచ్చిన.. ఇటివల బుమ్రా న్యూజిలాండ్ వెళ్లి వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. మరి ఇప్పుడు రిచర్డ్‌సన్ సైతం ఐపీఎల్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 CONFIRMED 🚨
👉 Jhye Richardson ruled out of the ODI series vs India due to hamstring injury 🇦🇺
👉 Richardson is further unlikely to play for Mumbai Indians in the IPL 2023 🏆#INDvAUS pic.twitter.com/hKRCZbpRMm
— SportsBash (@thesportsbash) March 6, 2023