విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో కెప్టెన్‌గా బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే విషయాన్ని టీమ్ మీటింగ్‌లోనే కోహ్లీ తమకు తెలియజేశాడని బుమ్రా తెలిపాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు అతన్ని అభినందించామని చెప్పుకొచ్చాడు. ‘ఓ జట్టుగా మేమంతా చాలా క్లోజ్. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టులో ఎంతో మార్పు తెచ్చాడని కొనియాడాడు. ‘కోహ్లీ జట్టులో కొత్త శక్తితో పాటు ఫిట్‌నెస్ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. జట్టును అతను అద్భుత రీతిలో నడిపించాడు. ప్రతీ ఒక్కరు అతని సారథ్యంలో ఒకే డైరెక్షన్‌లో నడిచారు. విరాట్ అసాధారణమైన ఆటగాడు అని అన్నాడు.
ఇక తర్వాతి కెప్టెన్ ఎవరూ? అనే విషయంపై స్పందిస్తూ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. సారథ్య బాధ్యతలు అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఏ ప్లేయర్ కూడా కెప్టెన్సీ అవకాశం వస్తే వద్దని చెప్పడు. నేను కూడా అంతే. కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినా.. రాకపోయినా నా ఆలోచన దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎల్లప్పుడూ జట్టు విజయం కోసం శ్రమిస్తాను. బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను.
అదనపు బాధ్యతల గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. వీలైనంత వరకు రాహుల్‌కి సహకారం అందిస్తూ.. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. యువ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టినప్పుడు.. సీనియర్లను చాలా ప్రశ్నలు అడిగేవాడిని. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడ్డాయి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. మరి కెప్టెన్సీకి సిద్ధమంటూ బుమ్రా చెప్పిన మనసులోని మాటపై, బుమ్రా కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
💬 💬 He is energy driven; he has brought a lot of change. @Jaspritbumrah93 lauds @imVkohli for his contribution as #TeamIndia captain. 👏 👏 pic.twitter.com/x5FJVN37qt
— BCCI (@BCCI) January 17, 2022
Jasprit Bumrah as India’s next Test captain anyone? pic.twitter.com/Gur6rKYMmw
— ESPNcricinfo (@ESPNcricinfo) January 17, 2022
Integrity, insight and inclusivity.
Your contribution to the team as captain is invaluable, you’ve been a great leader to this side. It’s been a pleasure playing under you.🙌 pic.twitter.com/K5iwPIuplZ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 15, 2022