సునామీ ఇన్నింగ్స్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ కొట్టి అదరగొట్టాడు ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో అతను తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ 10 సిక్స్‌లు, 9 ఫోర్లతో సాయంతో సెంచరీ సాధించాడు.
కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టామ్ బాంటన్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 47 బంతుల్లో 115 పరుగులు చేసి రాయ్ ఔటయ్యాడు. అతని సెంచరీ కారణంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్లకు 231 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు నెలల క్రితం, జాసన్ రాయ్ గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ ఆడలేకపోయాడు. జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఈ వార్మప్ మ్యాచ్‌లో 13-13 మంది ఆటగాళ్లు ఆడారు. ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు పడిపోయాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రాయ్‌తో పాటు బాంటన్ 32, జేమ్స్ విన్స్ 40 నాటౌట్, ఔన్ మోర్గాన్ 22, ఫిల్ సాల్ట్ 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరి రాయ్ తుపాన్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jason Roy returns to action with a 36-ball hundred ahead of the West Indies T20Is 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2022