క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెమి గాడ్స్‌లాగా క్రికెటర్లను ఆరాధించే అభిమనులు కోట్లలో ఉన్నారు. వారితో ఒక్క ఫొటో దిగేందుకు ఎంతో ఆసక్తి, ఉత్సహం చూపిస్తారు. తమ అభిమాన ఆటగాడి ఆటోగ్రాఫ్ దొరికితే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు. సాధారణంగా ఎవరైనా ఆటోగ్రాఫ్‌ను పేపర్ ఇస్తారు.. క్రికెటర్ల అయితే.. బ్యాట్, బాల్, క్యాప్, జెర్సీలపై కూడా ఆటోగ్రాఫ్ ఇస్తుంటారు.
Jack Leach signing a guy’s head 😂 #Ashes pic.twitter.com/g6JL6xaqiC
— 7Cricket (@7Cricket) January 5, 2022
కానీ యాషెస్ సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ జాక్ లీచ్.. తన అభిమానికి ఇచ్చిన ఆటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాక్ లీచ్ తన అభిమాని గుండుపై సైన్ చేశాడు. ఆ అభిమాని వద్ద సమయానికి పేపర్ లాంటింది ఏమి లేకపోవడంతో.. మళ్లీ అవకాశం వస్తుందో రాదో అని తన గుండుపైనే ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. మరి ఈ గుండుపై ఆటోగ్రాఫ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గాలి కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో! ఎందుకంటే..