ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ కి సిద్ధమవుతున్నారు. అంతే కాదు జూన్ 7 న భారత్ తో ప్రతిష్టాత్మక WTC ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ ఆడుతుండడం ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సంచలనం కామెంట్స్ చేసాడు.
ఆస్ట్రేలియాకు యాషెస్ అనేది ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రకంగా ఈ ట్రోఫీ గెలిస్తే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఫీలైపోతుంటారు. యాషెస్ సిరీస్ ద్వారానే క్రికెట్ కి భీజం పడింది. ఇదొక టెస్టు సిరీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ నిర్వహిస్తారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ కి ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ ప్రాక్టీస్ చేస్తూ సిద్ధమవుతున్నారు. అంతే కాదు జూన్ 7 న భారత్ తో ప్రతిష్టాత్మక WTC ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ ఆడుతుండడం ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సంచలనం కామెంట్స్ చేసాడు.
ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైకేల్ క్లార్క్ కి ఇప్పుడు తమ ప్లేయర్లు ఐపీఎల్ ఆడడం అస్సలు నచ్చడం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రధాన పేసర్లలో ఒకడైన జోష్ హాజెల్ వుడ్ మీద కాస్త అసహనాన్ని ప్రదర్శించాడు. క్లార్క్ మాట్లాడుతూ ” హాజెల్ వుడ్ ఐపీఎల్ ఎందుకు ఆడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఓ వైపు ఆసీస్ ప్లేయర్లందరూ యాషెస్ సిరీస్ కి WTC ఫైనల్ కి ప్రిపేర్ అవుతుంటే.. హాజెల్ వుడ్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. నెట్స్ లో అందరికంటే ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇది అతనికి ఏ మాత్రం ఉపయోగపడుతుంది. వీరు ఐపీఎల్ ఆడకుండా ఉండలేకపోతున్నారు. ఇండియాకి నో చెప్పే ధైర్యం లేక వీరు ఐపీఎల్ ఆడుతున్నారు. గ్రీన్ తో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ అతను మాత్రం ఐపీఎల్ ఆడతానని చెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐపీఎల్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తే తప్పా.. వీరు ఐపీఎల్ వదిలేలా లేరు” అని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో అందరూ యాషెస్ WTC ఫైనల్ కి సన్నద్ధమవుతుంటే.. హాజెల్ వుడ్, గ్రీన్, వార్నర్ ఐపీఎల్ ఆడుతున్నారు. వీరు ముగ్గురు ఆస్ట్రేలియా టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్లు. ప్రస్తుతం గాయం కోలుకున్న హేజెల్ వుడ్ ఆర్సీబీ తరపున ఆడిన తొలి మ్యాచులోనే సత్తా చాటాడు. లక్నోతో జరిగిన మ్యాచులో మూడు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక గ్రీన్, వార్నర్ కూడా ఐపీఎల్ ల్లో బాగానే రాణిస్తున్నారు. మరి తమ దేశ క్రికెటర్లు ఐపీఎల్ ఆడడంపై క్లార్క్ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.