న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. రెండో వన్డేలో కూడా భారత బౌలర్లు చెలరేగిపోయారు. వీరిలో ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పేరు బాగా వినిపిస్తోంది. తొలి వన్డేలో హోమ్ గ్రౌండ్లో సిరాజ్ విజృంభించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రెండో వన్డేలో కూడా తనదైనశైలిలో చెలరేగాడు. 6 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. సిరాజ్ బ్యాక్ టూ బ్యాక్ ప్రదర్శన అటు జట్టులోనే కాదు.. అభిమానుల్లో కూడా ఆత్మవిశ్వాన్ని నింపుతోంది.
ఒకప్పుడు ఎన్నో అవమానాలు, ట్రోలింగ్ ఎదుర్కొన్న మహ్మద్ సిరాజ్ ఇప్పుడు జట్టు నుంచే కాదు.. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 2019 జనవరిలో వన్డే క్రికెట్ లో 263వ స్థానంలో ఉన్న మహ్మద్ సిరాజ్. ఇప్పుడు వన్డే క్రికెట్ లో 3వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియాకి సిరాజ్ రూపంలో ఒక కొత్త ఆయుధం దొరికినట్లు అయ్యింది. జట్టులో బుమ్రా లేని లోటు బాగా కనిపించింది. కొత్త బాల్ తో వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేసే బౌలర్ కరువయ్యారు. అయితే వైట్ బాల్ క్రికెట్ లో ఇప్పుడు సిరాజ్ ఇస్తున్న ప్రదర్శన చూస్తుంటే ఆ లోటు తీరిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిరాజ్ ను సరిగ్గా ట్రైన్ చేసుకుంటే.. వచ్చే వరల్డ్ కప్‌కి బాగా అక్కరకు వస్తాడంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో సిరాజ్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడంటూ ప్రశంసిస్తున్నారు.
నిజానికి బుమ్రా జట్టులో ఉన్న సమయంలో టీమిండియా పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. బుమ్రా లేని మ్యాచుల్లో ఎంత భారీ స్కోరు కొట్టినా కూడా దానిని కాపాడుకునే పరిస్థితి కనిపించలేదు. అదే సిరాజ్ లాంటి బౌలర్‌ని సరిగ్గా తయారు చేసుకుంటే.. రాబోయే కీలక టోర్నమెంట్లకు చక్కగా పనికొస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టెస్టుల్లో తాను రాణించగలడని నిరూపించుకున్నాడు. కేవలం 29 ఇన్నింగ్స్ లోనే 46 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. అటు వైట్ బాల్ క్రికెట్ లో కూడా అతడిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తాడని చెబుతున్నారు.
Mother of Siraj cheering for his son in the first ODI. pic.twitter.com/R2B7oZKp8X
— Johns. (@CricCrazyJohns) January 19, 2023
ఎప్పుడూ ఒక బౌలర్, ఒక బ్యాట్స్ మన్ మీద ఆధారపడి గేమ్ ఆడకూడదని మాజీలు సైతం చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ మాటలు జాస్ప్రిత్ బుమ్రా విషయంలో ప్రస్ఫుటంగా స్పష్టమైంది. బుమ్రా జట్టులో లేకపోవడం వల్ల కొత్త బాల్ తో అటాక్ చేసే ఒక బౌలర్ లేక టీమిండియా చాలా ఇబ్బందులు పడింది. వచ్చే వరల్డ్ కప్ లో ఇలాంటి దృశ్యాలు రిపీట్ కాకుండా ఉండాలి అంటే.. అందివచ్చిన సిరాజ్ కు శిక్షణ ఇచ్చి మరింత రాటుతేలేలా చేయాలంటూ నిపుణులే కాదు.. మాజీలు సైతం కామెంట్ చేస్తున్నారు. బుమ్రాలేని లోటును మహ్మద్ సిరాజ్ తప్పకుండా భర్తీ చేయగలడు ఉంటూ ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Siraj In The Powerplays 🔥#INDvNZ #MohammedSiraj pic.twitter.com/bnw33kswpT
— CRICKETNMORE (@cricketnmore) January 21, 2023