IPL 2023: ఫస్ట్ సీజన్ నుంచి కొన్నాళ్ల పాటు సోనీ మ్యాక్స్ టీవీ ఛానెల్ లో ప్రసారం చేశారు. ఇక స్టార్ స్పోర్ట్స్.. ప్రసార్ హక్కుల్ని దక్కించుకున్న తర్వాత స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో పలు భాషల్లో మ్యాచుల్ని ప్రసారం చేస్తూ వచ్చారు. మొబైల్ వ్యూయర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచులు స్ట్రీమింగ్ అయ్యేవి..
మిగతా క్రికెట్ మ్యాచులు చూస్తారో లేదో తెలియదు గానీ ఐపీఎల్ ని మాత్రం ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూస్తారు. ఎందుకంటే ఆ లీగ్ లో మజా అలా ఉంటుంది. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది.. ఈ టోర్నీ రేంజ్ పెంచుకుంటూనే వస్తుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఐపీఎల్ చూడాలనుకుంటే.. టీవీలో లేదంటే మొబైల్లో చూడాలి. ప్రస్తుతమున్న బిజీ లైఫ్ వల్ల మ్యాగ్జిమం అందరూ మొబైల్లోనూ చూస్తూ వచ్చారు. అయితే దానికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఈసారి మాత్రం అవేం లేకుండా అంటే ఉచితంగా మ్యాచులు చూసే బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ నుంచి కొన్నాళ్ల పాటు సోనీ మ్యాక్స్ టీవీ ఛానెల్ లో ప్రసారం చేశారు. ఇక స్టార్ స్పోర్ట్స్.. ప్రసార్ హక్కుల్ని దక్కించుకున్న తర్వాత స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో పలు భాషల్లో మ్యాచుల్ని ప్రసారం చేస్తూ వచ్చారు. మొబైల్ వ్యూయర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచులు స్ట్రీమింగ్ అయ్యేవి. అయితే 2023-27 సీజన్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని మాత్రం రిలయన్స్ కి చెందిన వయకామ్ 18 సంస్థ.. రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే సీజన్ కోసం కొత్తగా ఓ యాప్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అలానే ఐపీఎల్ 2023 మొత్తం లీగ్ ని క్రికెట్ ప్రేమికుల కోసం ఉచితంగా ప్రసారం చేయనుందని సమాచారం. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా 11 భాషల్లో జియో సినిమా, జియోటీవీ యాప్స్ లో జియో సిమ్ యూజ్ చేస్తున్నవారు.. ఐపీఎల్ అన్ని మ్యాచుల్ని ఫ్రీగా చూడొచ్చట. గతంలో హాట్ స్టార్ లో ఐపీఎల్ చూసేందుకు నెలకు రూ.99 కట్టాల్సి వచ్చేది. జియో మాత్రం ఉచితంగా ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జియో సిమ్ విషయంలో చేసినట్లే.. తొలుత ఫ్రీగా ఇచ్చి, బాగా అలవాటు పడిన తర్వాత డబ్బులు వసూలు చేయాలనే స్ట్రాటజీనే ఐపీఎల్ కు కూడా ఉపయోగించబోతుందని క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది ఫ్రీగా ఉండొచ్చు గానీ.. వచ్చే సీజన్ నుంచి మాత్రం భారీగా డబ్బులు వసూలు చేసే అవకాశముందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఐపీఎల్ మ్యాచులు ఫ్రీ అంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి./p>
Jio to stream IPL for free in 2023. (Source – Exchange4media)
— Johns. (@CricCrazyJohns) January 10, 2023