క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లకు ఉన్న క్రేజే వేరు. ‘పేస్’ వీరికున్న ఆయుధం అయితే.. దీనికి తోడు బౌన్సర్లు సంధిస్తే ఇక అంతే సంగతులు. ఆడాలో తెలియదు.. తగలకుండ తప్పించుకోవాలో తెలియదు. నిజానికి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. పేస్ కు తోడు.. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే అటువంటి బౌలర్లు సునాయసంగా సక్సెస్ అవుతారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఇదే వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) ప్రాక్టీస్ సెషన్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. ప్రాక్టీస్ సెషన్‌లో 22 ఏళ్ల ఈ యువ బౌలర్ గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌన్సర్లు వేస్తూ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. అతడు 155 కిలో మీటర్ల వేగంతో విసిరిన మొదటి బౌన్సర్‌ను పూరన్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఫ్రాక్షన్ అఫ్ సెకండ్స్ లో బాల్ కీపర్ చేతిలోకి వెళ్లినట్లు కనబడుతోంది. ఇక రెండో బంతిని కూడా ఉమ్రాన్ మాలిక్ అలాగే బౌన్సర్‌గా వేయడంతో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పూరన్.
The first bouncer looks over 155 clicks! I’m sure #UmranMalik will break the speedometer this year
— Mohsin Kamal (@64MohsinKamal) March 23, 2022
ఇది కూడా చదవండి: రాణించిన నికోలస్ పూరన్..! కేన్ మామ టీంపై భువి టీం విజయం..!
ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్ 2022లోనూ ఇదే వేగంతో బౌలింగ్ చేస్తే సరికొత్త రికార్డు క్రియేట్ చేయొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 29న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Actors and characters. 😂#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/VgBle5HifC
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2022
ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, జగదీశ్ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ఫజల్హక్ ఫరూకీ.
Hold on to a blinder? Yes, he Kane. 🔥#TATAIPL #OrangeArmy #ReadyToRise pic.twitter.com/rSQrWsnDeG
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2022
Batting? Captaincy? Playing the guitar? No problem, just call Kane Mama 🧡🎸#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/eL6VbdVisn
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2022