ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమితో డీలాపడ్డ SRH.. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. అలాగే లక్నో.. తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో అద్బుత విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి ఈ మ్యాచ్ ఏ జట్టుకు విజయావకావలు ఉన్నాయో పరిశీలిద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
ఈ జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చాలా బలహీనంగా కనిపిస్తుంది. తొలి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి జట్టుకు 200 పైచిలుకు పరుగుల సమర్పించుకుని, ఛేజింగ్‌లో కనీసం 150 మార్క్‌ను కూడా దాటలేదు. తొలి మ్యాచ్‌లో మార్కరమ్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ విఫలం అయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, కోట్లు పెట్టి కొన్న పూరన్ రాణించాల్సి ఉంది. వారి ప్రదర్శనపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. SRHకు ప్రధాన లోపం బలమైన ఓపెనింగ్ జోడి లేకపోవడం. బౌలింగ్ కొంత పర్వాలేకున్నా.. తొలి మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించారు. ఈ మ్యాచ్‌లో నటరాజన్‌కు విశ్రాంతి ఇచ్చి.. సుందర్‌కు తోడుగా మరో స్పిన్నర్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్..
సన్‌రైజర్స్‌తో పోల్చుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడి, మిడిల్డార్‌లో లూయిస్, మనీష్ పాండే, దీపక్ హూడా ఉన్నారు. చివరి ఓవర్లలో హిట్టంగ్ కోసం యువ సంచలనం ఆయుష్ బదోని ఉన్నాడు. కృనాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఇలా బ్యాటింగ్ పరంగా లక్నో పటిష్టంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలం అయిన ఓపెనింగ్ జోడి ఈ మ్యాచ్‌లో పుంజుకుంటే SRHకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయంలోనూ లక్నో బలంగా ఉంది. పేస్‌లో శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా, ఆవేష్ ఖాన్ ఉండగా.. స్పిన్‌లో రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా ఉన్నారు.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్పిన్నర్‌కు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్‌చేస్తేనే విజయావకాశాలు ఉంటాయి.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు అనాలాసిస్ చేసిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించే అవకాశం ఉంది. లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చి స్థాయికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తుది జట్ల అంచనా..
లక్నో సూపర్ జెయింట్స్..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, ఆండ్రూ టై, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ గోపాల్.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.