సన్‌రైజర్స్ హైదరాబాద్.. పలకడానికి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అన్న రీతిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ,.. జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అంతంత మాత్రమే. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో టైటిల్ విన్నర్ గా నిలిచిన జట్టు, 2018 లో రన్నరప్ తో సరిపెట్టింది. ఇదే.. ఐపీఎల్ లీగ్ లో ఎస్‌ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన. 2019 లో పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానానికి పరిమితమైన ఎస్‌ఆర్‌హెచ్ 2020 లో 3వ స్థానానికి ఎగబాకింది. ఇక.. గతేడాది(2021) రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడుతూ.. టేబుల్ లో అట్టడుగున నిలిచింది.
ఐపీఎల్ 2022 ఎడిషన్ కి సంబంధించి పూర్తి షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభంకానుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. కేన్ విలియమ్సన్ సారధ్యంలోని ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది.
మార్చి 29 (మంగళవారం)న విలియమ్సన్ సేన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభంకానుంది. గతేడాది 14 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ మూడే మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
2. తేదీ: ఏప్రిల్ 4, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: లక్నో సూపర్ జెయింట్స్, డివై పాటిల్ స్టేడియం, ముంబై
3. తేదీ: ఏప్రిల్ 9, మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్, డివై పాటిల్ స్టేడియం, ముంబై
4. తేదీ: ఏప్రిల్ 11, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్, డివై పాటిల్ స్టేడియం, ముంబై
5. తేదీ: ఏప్రిల్ 15, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై
6. తేదీ: ఏప్రిల్ 17, మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్ కింగ్స్, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై
7. తేదీ: ఏప్రిల్ 23 రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై
8. తేదీ: ఏప్రిల్ 27 (బుధవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
9. తేదీ: మే 1, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే
10. తేదీ: మే 5, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ఢిల్లీ క్యాపిటల్స్, వేదిక: బ్రబోర్న్ స్టేడియం, ముంబై
11. తేదీ: మే 8, మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
12. తేదీ: మే 14, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే
13. తేదీ: మే 17, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
14. తేదీ: మే 22, రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్ కింగ్స్, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
Mark the dates ✍️#OrangeArmy, here’s your #OrangeCalendar for #IPL2022 🧡#IPLFixtures #TATAIPL #ReadyToRise pic.twitter.com/cJfHlPRFwn
— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2022
ఆకర్షణీయమైన రూపం, అందుకు తోడు.. అందమైన నవ్వుతో వేలంలో చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన కావ్యా మారన్..మీడియా మొఘల్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె. ఫ్యాన్స్.. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జట్టును టైటిల్ ఫేవరెట్ గా నిలబెడతానంటోంది కావ్యా పాప. మరి ఈసారైనా ఈసారైనా కావ్యా పాప కల ఫలించాలని మనమూ ఆశిద్దాం.
ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ లిస్ట్
#SRH don’t deserve her😭
I think Everyone will watch SRH match only for this Kavya Maran😅#SRHvsDC pic.twitter.com/51c9xqlTNh
— Kabir Moni Patel- ✨❤️🌾❤️✨ (@KabeerMoni) September 22, 2021
కేన్ విలియమ్సన్(కెప్టెన్), అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ
#OrangeArmy = best fans in the world 🧡🤩#F1 pic.twitter.com/ebDpTiaJPL
— SunRisers Hyderabad (@SunRisers) December 12, 2021