ఐపీఎల్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు క్రియేట్ అవుతుంటాయి.. మరెన్నో బద్దలుకూడా అవుతుంటాయి. కానీ.. ఆసీస్ ఆల్‌రౌండర్ నమోదు చేసిన అత్యంత చెత్త రికార్డు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా డేనియల్ సామ్స్ నిలిచాడు. అతని బౌలింగ్ యావరేజ్ 242. ఇంత దారుణమైన బౌలింగ్ యావరేజ్ మరే బౌలర్‌కు లేదు. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన సామ్స్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు.
సామ్స్.. బీబీఎల్‌లో 62 మ్యాచ్‌ల్లో 82 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 622 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 98 నాటౌట్. ఇంతమంచి రికార్డు కలిగిన ఆటగాడు ఐపీఎల్‌లో జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రస్తుతం సామ్స్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సామ్స్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఆర్‌సీబీకి మారాడు. భారత్‌లో జరిగిన ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల్లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కోవిడ్ కారణంగా రద్దు కావడం.. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీలకు దూరమయ్యాడు. ఆ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు కలిపి 6.50 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు.ఇక ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు నిర్వహించిన మెగావేలంలో డేనియల్ సామ్స్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. బీబీఎల్‌లో రాణించడంతో అదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే మరోసారి నిరాశపరిచాడు. సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సామ్స్ 11.13 ఎకానమీ రేటుతో 89 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవరాల్‌గా మూడేళ్ల నుంచి చూసుకుంటే డేనియల్ సామ్స్ ఏడు మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు బౌలింగ్ చేసి 242 బౌలింగ్ యావరేజ్‌తో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. కోట్లు పెట్టి కొంటే ఐపీఎల్ కప్పు చేతుల్లో పెడతాడు అనుకుంటే.. చెత్త రికార్డు నమోదు చేశాడంటూ.. ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి సామ్స్ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వికెట్ తీయకుండా భారీగా పరుగులిచ్చినా.. ఉమ్రాన్ మాలిక్‌కు రూ.లక్ష ఇస్తున్నారు ఎందుకని..?
The bowling average of Daniel Sams in IPL is 242.
#IPL2022 #MI #RR #MIvsRR #MIvRR
Follow us for more @TamilAutomation
— KGF Beast (@Ironman_Den) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.