ఐపీఎల్-2021 చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి మరోసారి తన సత్తాను చాటుకుంది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హారాహారిగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోనిసేన కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడి అనూహ్యంగా కప్ ను ఎగరేసుకుని ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. ఇక గత కొంత కాలం నుంచి ఎంతో ఉత్కంఠను తలపించిన ఐపీఎల్ 2021 సీజన్ లో దాదాపుగా అన్ని జట్లు తమ తమ స్థాయికి తగ్గ ఫలితాన్ని చూపించగా చివరికి సీఎస్కే మాత్రమే ఫైనల్ లో కప్ గెలుచుకుంది.
ఇక బాగా ఆడి కప్ గెలుచుకున్న జట్టుకు ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ జట్టుకు ప్రైజ్ మనీ ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఫైనల్ లో గెలిచి విజేతగా నిలిచిన చెన్నైజట్టుకు మాత్రం రూ.20 కోట్లు దక్కగా, రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కి రూ.12.5 కోట్లు దక్కాయి. దీంతో పాటు మూడో స్థానానికి పరిమితమైన ఢిల్లీకి రూ. 8.75 కోట్లు దక్కాయి. ఇక ఇవే కాకుండా పర్పుల్ క్యాప్ దిక్కించుకున్న హర్షల్ పటేల్ కి రూ.10 లక్షలు దక్కాయి. ఇక ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా చెన్నై టీం ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి రూ.10 లక్షలు దక్కాయి.