SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Indian Malinga Ajit Agarkar Inspirational Story

Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్.. మీకు తెలియని ఓ హీరో లైఫ్ స్టోరీ!

గత కొంతకాలంగా టీమిండియా పురుషుల జట్టుకి కెప్టెన్ గా సెలెక్ట్ అవుతాడని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇంతకీ ఎవరీ అజిత్ అగార్కర్?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 5 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ గా  అజిత్ అగార్కర్.. మీకు తెలియని ఓ హీరో లైఫ్ స్టోరీ!

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అంటే ఇప్పటి జెనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చుగాని ఒకప్పుడు టీంఇండియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు. పదునైన పేస్ తో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టేవాడు. వన్డే, టెస్టుల్లో నిలకడగా రాణించిన అగార్కర్ అండరేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. అయితే తాజాగా ఈ యార్కర్ ల వీరుడి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. గత కొంతకాలంగా టీమిండియా పురుషుల జట్టుకి కెప్టెన్ గా సెలెక్ట్ అవుతాడని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాజంపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పేరును మంగళవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరీ అజిత్ అగార్కర్? ఇతను ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌరవ్‌ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో ఒక వెలుగు వెలిగిన బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌. భారత జట్టులో స్పీడ్‌ బౌలర్‌గా, యార్కర్ల స్పెషలిస్ట్‌గా ఉండేవాడు. అతని బౌలింగ్‌ యాక్షన్‌కు ఫిదా అయిన ఎందరో క్రికెట్‌ అభిమానులు గల్లీ క్రికెట్‌లో అగార్కర్‌లా బౌలింగ్‌ చేసేందుకు ట్రై చేసి మురిసిపోయేవారు. ఎవరైనా ఒక కుర్రాడు యార్కర్లు వేస్తుంటే.. అగార్కర్‌లా వేస్తున్నాడే అనిపించేది. ఇప్పుడంటే యార్కర్ల కింగ్స్‌గా మలింగా, బుమ్రా పేరుతెచ్చుకున్నారు గానీ.. అప్పట్లో అజిత్‌ అగార్కర్‌ యార్కర్‌ వేస్తే.. ఎంతటి బ్యాటర్‌ అయినా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే. అంతటి కచ్చితమైన లెంగ్త్‌తో యార్కర్‌ సంధించేవాడు అగార్కర్‌. అతని రన్నప్‌, బౌలింగ్‌ యాక్షన్‌ చూడముచ్చటగా ఉండేవి. ఒంటి మీద కేజీ కండ కూడా లేదు అనిపించేలా ఉండే అగార్కర్‌.. యార్కర్‌ సంధిస్తే.. రామబాణంలా దూసుకుపోయేది. తన బౌలింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిపించాడు అగార్కర్‌. కానీ.. టీమ్‌లోకి రావడం, రాణించడం, అద్భుతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకోవడం కోసం అగర్కార్‌ నిత్య పోరాటమే చేయాల్సి వచ్చింది.

అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా.. తట్టుకుని నిలబడి, సమాధానం చెప్పిన ఒక ఫైటర్‌గా అగార్కర్‌ గురించి చెప్పుకోవచ్చు. శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లు టీమిండియా పేస్‌ బౌలింగ్‌ను ఏలుతున్న కాలంలో జట్టులోకి వచ్చాడు అగార్కర్‌. అతన్ని చూస్తే.. ఈ బక్కోడు స్పీడ్‌ బౌలరా? అనే అనుమానం కలిగింది అప్పట్లో.. చూడ్డానికి పొట్టిగా, చాలా బక్కగా ఎముకలు తేలి, పిల్లి కళ్లు ఏసుకుని.. కచ్చితంగా పేస్‌ బౌలర్‌ కాదులే అనిపించేలా ఉండేవాడు అగర్కార్‌. దీంతో జట్టులోకి వచ్చిన కొత్తలోనే స్పీడ్‌ బౌలర్‌కు ఉండాల్సిన మినిమం క్వాలిటీస్‌ కూడా లేవనే అవమానం ఎదుర్కొన్నాడు. అప్పట్లో స్పీడ్‌ బౌలర్లంటే.. ఒడ్డు, పొడవు, దృఢమైన శరీరం కలిగి ఉండాలనే భావనలో ఉండేవారు. కానీ.. అజిత్‌ అగార్కర్‌ అందుకు పూర్తి భిన్నంగా ఉండేవాడు. కానీ.. అతను యార్కర్‌లు సంధిస్తే గానీ తెలియదు.. అతనిలోని అసలు సత్తా. బాణం గురిపెట్టినట్లు.. బ్యాటర్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తూ.. వికెట్లను ఠప్‌ మని ఎగరేవి. అగార్కర్‌ స్పీడ్‌, యార్కర్లు చూసిన తర్వాత.. స్పీడ్‌ బౌలర్లంటే కచ్చితంగా మంచి హైట్‌ ఉండాలనే భ్రమ పూర్తిగా తొలిగిపోయింది.

indian-malinga-ajit-agarkar-inspirational-story

టీమిండియాకు స్పీడ్‌ బౌలింగ్‌ అంటే ఒక్క శ్రీనాథే కనిపిస్తున్న​ కాలంలో.. 145 యావరేజ్‌ స్పీడ్‌తో మరో జెమ్‌ లాంటి బౌలర్‌ భారత్‌కు దొరికాడు. కెరీర్‌ ఆరంభంలోనే బాడీ షేమింగ్‌కు గురైనా.. దానికి తన బౌలింగ్‌తో సమాధానం చెప్పిన అగార్కర్‌కు మరో అవమానం ఎదురైంది. ఆస్ట్రేలియాపై బ్యాటింగ్‌కు దిగి వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌ అయ్యాడు. దీంతో అగార్కర్‌ను ‘బాంబే డక్‌’ అంటూ హేళన చేసేవారు. ఈ అవమానికి సైతం అగార్కర్‌ అద్భుతమైన సమాధానం చెప్పాడు. 2003లో అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి.. భారత్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన అగార్కర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన రికీ పాంటింగ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ చేసి.. దెబ్బకు దెబ్బ తీశాడు. అలాగే 2003లో జరిగిన టీవీఎస్‌ కప్‌ టోర్నీలో సైతం ఆసీస్‌పై 4 వికెట్లతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్‌ను అవుట్‌ చేసిన బాల్‌ అయితే.. థండర్‌బోల్ట్‌గా చెప్పవచ్చు. అగార్కర్‌ వేసిన సూపర్‌ యార్కర్‌కు గిల్‌క్రిస్ట్‌ వికెట్‌ గాల్లో ఎగిరి పడింది. ఆ వీడియోను ఇప్పుడు చూసినా.. గూస్‌బమ్స్‌ వస్తాయి.

ఇప్పటికీ ఒక అరుదైన రికార్డు అజిత్‌ అగార్కర్‌ పేరిటే ఉంది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అజిత్‌ అగార్కర్‌ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్ల మార్క్‌ను చేరుకున్న మూడో బౌలర్‌గా అజిత్‌ అగార్కర్‌ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 23 వన్డేల్లోనే అగార్కర్‌ 50 వికెట్లు సాధించాడు. శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లాంటి హేమాహేమీలు టీమ్‌లో నిలదొక్కుకుపోయిన కాలంలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అగార్కర్‌.. వారి తర్వాత ఆశిష్‌ నెహ్రా, జహీర్‌ ఖాన్‌ త్రయాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాడు. వారి తర్వాత వచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌, లక్ష్మిపతి బాలాజీ, శ్రీశాంత్‌ లాంటి యువ క్రికెటర్లతో సైతం అగార్కర్‌ పోటీ పడ్డాడు. టీమ్‌లోకి వస్తూ.. పోతూ ఉన్నా.. కూడా అగార్కర్‌ ఎప్పుడూ కూడా పట్టువదల్లేదు. కెరీర్‌ ఆరంభం నుంచి ఎదురైన ప్రతి సవాల్‌కు ఎదురెళ్లాడే కానీ.. వెన్ను చూపలేదు.

indian-malinga-ajit-agarkar-inspirational-story

బౌలింగ్‌లో సంచలనాలు నమోదు చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా.. బ్యాట్‌తోనూ అగార్కర్‌ దుమ్ములేపాడు. టెస్టుల్లో అగార్కర్‌కు ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే 2002లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అగార్కర్‌.. ఏకంగా 95 పరుగులతో రఫ్పాడించాడు. 102 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 95 పరుగులు చేసి.. విండీస్‌ బౌలర్ల మతిపోగొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌ అగార్కర్‌ వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఇక తన కెరీర్‌లో మొత్తం 26 టెస్టులు ఆడిన అగార్కర్‌ 58 వికెట్లు పడగొట్టాడు. అలాగే 571 పరుగులు సైతం చేశాడు. ఇక 191 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. 1269 పరుగులు కూడా చేశాడు. అలాగే టీమిండియా తరఫున 4 టీ20 మ్యాచ్‌లు సైతం ఆడి 3 వికెట్లు తీసుకున్నాడు. గణాంకాల పరంగా సాధారణంగానే అనిపించినా.. అగార్కర్‌ కెరీర్‌ ఒక పోరాటం. దెబ్బ తిగిలిన చోటే గెలిచిన ఒక ఫైటర్‌ అతను. అజిత్‌ అగార్కర్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Ajit Agarkar
  • Cricket News
  • SumanTV Cricket Special
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam