మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో లక్షల ధర పలికిన కర్నూల్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి. పలికింది లక్షల రూపాయలే అయినా ఒక తెలుగు బిడ్డగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వించదగ్గదే. దేశం తరుపున ఆడే క్రికెటర్ కు ప్రాంతీయ వాదం ముడిపెట్టడం సరైనదేనా..? అనుకోకండి. ఒక తెలుగుబిడ్డ సాధించిన విజయాన్ని అందరకీ తెలియజేయాలన్నా ఉద్దేశ్యమే ఈ కథనం.
ముంబై వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలో మహిళా క్రికెటర్లపై ప్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. అంతర్జాతీయ క్రికెటర్, అండర్- 19 అన్న తేడా లేకుండా.. వారి ఆటతీరుకు తగ్గట్టుగా లక్షల నుంచి మొదలు కోట్ల రూపాయల వరకు పలికారు. ఈ వేలంలో ఇప్పటివరకూ భారత ఓపెనర్ స్మృతి మంధాన(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 3.4 కోట్లు) రికార్డు ధర పలకగా, టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (1.8 కోట్లు), ఆల్ రౌండర్ దీప్తి శర్మ (2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు)లు కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ధర పలికిన వారిలో ఉన్నారు.
ఈ వేలంలో తెలుగు తేజం, కర్నూల్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి లక్షల రుపాయలను తన ఖాతాలో వేసుకుంది. అంజలిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని సొంత గ్రామం. తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. గతేడాది చివర్లో భారత జట్టులోకి అరంగ్రేటం చేసిన అంజలిని యూపీ వారియర్స్ రూ.55 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా, అంజలి కనీస ధర.. రూ.30 లక్షలు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కూడా శర్వాణి సభ్యురాలిగా ఉంది.
India’s young talent Anjali Sarvani attracts a bid of INR 55 L from UP Warriorz .
UP Warriorz fans, how’s the josh? 🤩#WPLAuction | #CricketTwitter | #WomensIPL pic.twitter.com/929nL5hoIX
— Female Cricket (@imfemalecricket) February 13, 2023
లెఫ్ట్ ఆర్మ్ బౌలరైన అంజలి 2012లో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారి ఎంపికైంది. ఆ తర్వాత 2012-13 సీజన్‌లో రైల్వేస్‌కు, 2019-20 మధ్య ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అయితే.. 2017–18 సీనియర్ మహిళల క్రికెట్ ఇంటర్ జోనల్ త్రీ డే గేమ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ కు ప్రాతినిధ్యం వహించిన అంజలి తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. అదే తనకు ఇండియా- బి జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. అలాగే.. 2020లో పాట్నా వేదికగా జరిగిన మహిళల టీ20 క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా- బి జట్టు తరపున ఆడి మంచి ప్రదర్శన కనబర్చింది. అదే తనకు భారత జట్టుకు అదే అవకాశాన్ని కల్పించింది. రూ.55 లక్షలు.. జాక్ పాట్ హా అనిపించొచ్చు. కానీ అంతకంటే తక్కువ ధరకు అమ్ముడైన పురుష భారత అగ్ర క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వేలంలో మెరిసిన తెలుగుబిడ్డ అంజలిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mass akka nuvvu😎🏏♥️#anjalisarvani#Pawanakalyan #INDvPAK pic.twitter.com/mKA1rvrmq1
— ⚡FLASH⚡ (@bhargavreddy58) February 11, 2023