దాయాది పాక్ జట్టుపై భారత్ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. టీ20 వరల్డ్ కప్ ని మంచి విజయంతో ప్రారంభించారు. ఈ మ్యాచులో పాక్ ని ఓడించిన టీమిండియా.. అరుదైన రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది.
ఏదేమైనా సరే చిరకాల ప్రత్యర్థి పాక్ పై గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. వేరే ఏ గేమ్ అయినా మాములుగా ఉంటుంది కానీ క్రికెట్ లో గెలిస్తే మాత్రం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. పురుషుల జట్టు ప్రతిసారి ఐసీసీ టోర్నీల్లో పాక్ ని ఓడిస్తూనే ఉంది. తాజాగా టీ20 ప్రపంచకప్ సందర్భంగా తొలి మ్యాచులోనే మన అమ్మాయిలు అదరగొట్టేశారు. పాక్ పై విజయంతో టోర్నీని ప్రారంభించారు. ఇందులో విజయం సాధించడమే కాదు.. అరుదైన రికార్డుని కూడా భారత మహిళల క్రికెట్ జట్టు తన ఖాతాలో వేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేప్ టౌన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే వాళ్ల ఇన్నింగ్స్ కు మొదట్లోనే దెబ్బ పడింది. 10 పరుగుల స్కోరు దగ్గర ఓపెనర్ జవేరియా ఖాన్ ఔటైంది. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ మరో ఓపెనర్ మునీబా అలీ కూడా పెవిలియన్ కు చేరింది. ఆ తర్వాత వచ్చిన నిదా దార్.. కూడా త్వరగానే ఔటైపోయింది. ఇక అమీన్ బోలెడన్నీ బంతుల్ని వృథా చేసింది. పాక్ మహిళా జట్టు 12.1 ఓవర్లలో 68 పరుగులతో ఉంది. ఈ స్థితిలో తక్కువస్కోరుకే పరిమితం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మిడిలార్డర్ లో ఆయేషా నసీం.. తొలి బంతి నుంచే చెలరేగింది. సిక్సులు, ఫోర్లు కొడుతూ రెచ్చిపోయింది. దీంతో చివరి ఐదు ఓవర్లలో పాక్ జట్టు ఏకంగా 58 పరుగులు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది.
అనంతరం ఛేదనలో భారత్ ఓ మాదిరిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి వికెట్ కు షెఫాలీ వర్మ (33), యాస్తిక భాటియా(17).. 38 పరుగులు జోడించారు. గాయం వల్ల ఈ మ్యాచుకు దూరమైన స్మృతి మంధాన స్థానంలో వచ్చిన యాస్తిక.. క్రీజులో ఉన్నంతసేపు కాస్త ఇబ్బంది పడింది. ఓపెనర్లు ఔటైన కాసేపటికే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (16) కూడా పెవిలియన్ చేరింది. దీంతో గెలిపించే బాధ్యతని జెమీమా రోడ్రిగ్జ్(53 నాటౌట్), రిచా ఘోష్(31 నాటౌట్) తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా చివరి వరకు ఉండి 19 ఓవర్లలోనే మ్యాచుని ముగించారు. దీంతో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయంతో భారత్.. తాజా టీ20 వరల్డ్ కప్ జర్నీని షురూ చేసింది.
ఈ మ్యాచులో పాక్ పై భారత్ గెలవడమే కాదు పలు రికార్డులని కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా మహిళల జట్టుకు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఇప్పటివరకు భారత్-పాక్ మధ్య ఏడు మ్యాచులు జరగ్గా.. అందులో ఐదింటిలో మన జట్టే గెలవడం మరో విశేషం. ఇక పాక్ కూడా టీ20ల్లో, టీ20 ప్రపంచకప్ లోనూ భారత్ పై అత్యధిక స్కోరు చేసింది కూడా ఈ మ్యాచులోనే కావడం విశేషం. మరి పాక్ పై టీ20 ప్రపంచకప్ లో టీమిండియా గెలుపుతో జర్నీ షురూ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! ☺️
Well played, @JemiRodrigues 👏👏#TeamIndia | #T20WorldCup | #INDvPAK pic.twitter.com/CWbl2BtOP8
— BCCI Women (@BCCIWomen) February 12, 2023