ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు వరుసగా తమ సత్తా చాటుతున్నారు. అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్‌బౌల్స్‌లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్‌బౌల్స్‌లో మనకు ఇదే తొలి పతకం. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది.
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం అద్భుతమైన చారిత్రక విజయం అందుకున్నారు. లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు , రూపా రాణి టిర్కీ,లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా తమ సత్తా చాటారు.
Four unknown middle-aged women made the final of a little-known sports at it highest stage.
That’s the power of sports to turn-around lives❤️#LawnBowls l #CommonwealthGames
— The Bridge (@the_bridge_in) August 2, 2022
ఇప్పటి వరకు లాన్ బౌల్‌లో భారతదేశం ఎటువంటి పతకం సాధించలేదు. అయితే.. భారత మహిళలు మొదటి నుంచి తమ ఆటలో రాణిస్తూ.. మంచి ఆరంభంతో ఆకట్టుకున్నారు. 3 రౌండ్ల తర్వాత స్కోరు 3-3తో సమమైంది. దీని తర్వాత, భారత్ ధీటుగా బదులిచ్చి 7వ రౌండ్ తర్వాత 8-3 ఆధిక్యంలో నిలిచింది. భారత మహిళలు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి, బంగారు పతకం సొంతం చేసుకున్నారు. తాజా పతకంతో బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 4కి చేరింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#CommonwealthGames2022 | Lovely Choubey, Pinki Singh, Nayanmoni Saikia and Rupa Rani Tirkey bring home Gold medal by beating South Africa 17-10 in the final of Lawn Bowls. pic.twitter.com/svw1pFk1QF
— ANI (@ANI) August 2, 2022
ఇది చదవండి: విండీస్‌ను చిత్తుచేసిన టీమిండియా! దంచికొట్టిన సూర్య