సాధారణంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. అది స్వర్ణమైనా.. మరొకటైనా. కానీ, ‘లాన్ బౌల్స్’ ఆట గురించే అరుదుగా తెలిసిన మన దేశంలో అలాంటి ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం అనుకుంటే.. ఇప్పుడు అదే క్రీడలో పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. భారత్ కు స్వర్ణం తెచ్చిపెట్టిన లాన్ బౌల్స్. ఈ గేమ్ ఎలా ఆడతారు..? రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆట గురుంచి తెలుసుకునే ముందు.. కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి.
లాన్ బౌల్స్ అనేది ఓ ఔట్‌డోర్ క్రీడ. దీన్ని లాన్ బౌలింగ్ అని కూడా పిలుస్తారు. ఈ గేమ్.. అచ్చం మనం ఆడే ‘గోఠీ’ల ఆట లాంటిదే. టార్గెట్‌వైపు బంతిని చేత్తో రోల్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్‌ని ‘ది జాక్’ అని పిలుస్తారు. ఈ గేమ్ ప్రధాన లక్ష్యం.. క్రీడాకారులు కొంత దూరంలో నిలుచొని తమ బౌల్‌ను ‘జాక్’కు దగ్గరికి వెళ్లే విధంగా రోల్ చేస్తూ విసరాలి. అది వెళ్లి జాక్‌కు అత్యంత సమీపంలో నిలవాలి.
ఈ లాన్ బౌల్స్ ఈవెంట్‌లో మొత్తం నాలుగు ఫార్మాట్‌లు ఉంటాయి. సింగిల్స్, పెయిర్స్, ట్రిపుల్స్, ఫోర్స్. ప్రతి జట్టులోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఆయా ఫార్మాట్లకు ఆ పేరు పెట్టారు. సింగిల్స్ లో అయితే.. 21 పాయింట్లు ముందుగా ఎవరు సాధిస్తారో.. వారే విజేత. అదే నలుగురితో అయితే.. 18 రౌండ్లు ఉంటుంది. ఒక్కో రౌండ్లో.. ఒక్కో జట్టు 8 సార్లు బౌల్స్ త్రో చేయాల్సి ఉంటుంది.
Historic Win in a sport which no one even expected.. Incredible!! #LawnBowls #CommonwealthGames2022 #GoldMedal 🥇 pic.twitter.com/6wm2wAWtsz
— ʜɒɿƨʜɒl ⚡╭∩╮(︶︿︶)╭∩╮ (@HarshalLive) August 2, 2022
లాన్ బౌల్స్ నియమాలు..
ఈ గేమ్ క్రికెట్ మాదిరే టాస్‌తో మొదలవుతుంది. టాస్ గెలిచిన క్రీడాకారులు తొలి అవకాశం తీసుకుంటారు. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు తొలుత జాక్‌ను 23 మీటర్ల కన్నా ఎక్కువ దూరం రోల్ చేయాల్సి ఉంటుంది. ఆ జాక్ ఎక్కడైతే నిలుస్తుందో దాన్నే అంతిమ లక్ష్యంగా నిర్దేశిస్తారు. మరోవైపు ఈ రోల్‌తోనే జాక్, గేమ్ మొదలెట్టాల్సిన పాయింట్ మధ్య ఉన్న దూరాన్ని నిర్ణయిస్తారు. దీంతో క్రీడాకారులు త్రో చేసిన బౌల్స్.. జాక్‌కు దగ్గరగా వెళ్లినప్పుడు పాయింట్లు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఈ క్రీడలో విజయం సాధించాలంటే ఆయా క్రీడాకారులు లేదా బృందాలు.. తమ బౌల్స్‌ను జాక్‌కి అత్యంత సమీపంలోకి (ప్రత్యర్థుల కన్నా) విసిరేలా చూసుకోవాలి. ఇక్కడ ప్రత్యర్థి బౌల్‌ను పక్కకు పడేయడం ద్వారా కూడా పాయింట్లు సాధించవచ్చు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఫోర్స్ ఈవెంట్‌లో ప్రతి జట్టు ఒక ఎండ్ నుంచి ఎనిమిది త్రోలు విసురుతుంది. అలా 18 రౌండ్లు పూర్తవ్వాలి. అలాగే వ్యక్తిగత ఈవెంట్‌లో పోటీదారులు ప్రతి ఎండ్‌లో నాలుగు బౌల్స్ చేయాల్సి ఉంటుంది. అదే టీమ్ ఈవెంట్‌లో ప్రతి సభ్యుడు ఒక ఎండ్ నుంచి రెండు బౌల్స్ చేస్తారు. పాయింట్లు ఎలా ఇస్తారు?
ఒక జట్టు తన ప్రత్యర్థితో పోల్చితే జాక్‌కు దగ్గరగా విసిరిన బౌల్స్ సంఖ్య ఆధారంగా పాయింట్లను నిర్ణయిస్తారు.
ఉదాహరణకు:
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన 1930 నుంచి ప్రతీ ఏడిషన్‌లోనూ లాన్ బౌల్స్ ఈవెంట్ భాగంగా ఉంది. 1966 ఎడిషన్‌లో మాత్రం కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్ భాగంగా లేదు. జమైకాలో లాన్ బౌల్స్ నిర్వహించడానికి సరైన వేదిక లేకపోవడంతో 1966 కామన్వెల్త్‌లో లాన్ బౌల్స్‌ని భాగం చేయలేదు. ఒక్క ఇంగ్లాండ్‌లోనే 2 వేలకు పైగా లాన్ బౌల్స్ క్లబ్స్ ఉన్నాయి. ఆ దేశంతో పాటు చాలా ప్రాశ్చాత్య దేశాల్లో ఫుట్ బాల్ కంటే ఎక్కువ మంది లాన్ బౌల్స్ ఆడతారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో 2010, 2014, 2018 సీజన్లలో కూడా భారత జట్టు ఈ పోటీల్లో పాల్గొన్నా.. రెండుసార్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరింది. అంతకుముందు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈసారి మూడు సార్లు ఛాంపియన్ జట్టైనా సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి.. స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
History made!
Team 🇮🇳 defeat 🇿🇦 17-10 in the Women’s Fours to clinch their first ever 🥇in Lawn Bowls at @birminghamcg22 .
This is India’s 4th Gold medal in the games.
Nayanmoni Saikia, Pinki Singh, Lovely Choubey & Rupa Rani Tirkey, more power to you! pic.twitter.com/z5nmh7LjiO
— Team India (@WeAreTeamIndia) August 2, 2022
ఇదీ చదవండి: KL Rahul, Hardik Pandya: కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాకు గుడ్‌న్యూస్ చెప్పిన కోర్టు!
ఇదీ చదవండి: Ravindra Jadeja- Mumbai Indians: వచ్చే సీజన్ లో ముంబయి ఇండియన్స్‌కు రవీంద్ర జడేజా.. హింట్ ఇచ్చేశాడు!