గత కొంత కాలంగా భారత ఆటగాళ్లు పలు క్రీడల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్డ్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ లో అచింత షెవులి ఇండియాకు మరో గెల్డ్ మెడల్ సాధించాడు.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో మొదటి నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల అచింత ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అచింత స్నాచ్‌లో 143 కిలోలు,క్లీన్ అండ్ జెర్క్‌లో170 కిలోల బరువు ఎత్తిన టాప్ ప్లేస్‌లో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్ చేసి మొత్తం మీద 313 కేజీలతో (క్రీడల రికార్డు) పసిడి సొంతం చేసుకున్నాడు.
మలేసియాకి చెందిన హిదాయత్ రజతం గెలవగా.. కెనడాకి చెందిన షాద్ కాంస్యం సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అంచిత ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన కెరీర్ బెస్ట్ రికార్డును అధిగమించలేకపోవడం కొంత నిరాశకు గురిచేసినా గోల్డ్ మెడల్ రావడం మాత్రం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఇక 2021 జూనియర్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 2019, 2021ల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. స్వర్ణం సాధించిన ఈ 20 ఏళ్ల యువకెరటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Achinta Sheuli bags #TeamIndia‘s third 🥇 at @birminghamcg22 👏🎆
All three gold medals so far have been won by our weightlifters 🏋♂️🏋♀️🏋♂️#EkIndiaTeamIndia | @WeAreTeamIndia pic.twitter.com/kCJVxFVNYI
— Team India (@WeAreTeamIndia) July 31, 2022
ఇది చదవండి: కొనసాగుతున్న పతకాల వేట! వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో స్వర్ణం!