కామన్వెల్త్ క్రీడల్లో ఉమెన్స్ క్రికెట్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఇండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు విజయం దక్కలేదు. ఆసీస్ జట్టు భారత్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలకే హైలెట్‌గా నిలువనున్న ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ చూసేందుకు కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఈ మ్యాచ్ సంబంధించిన టిక్కెట్లు మూడు నెలల క్రితమే పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా.. ఈ మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకునే వారు.. సాయంత్రం 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్ ఛానెల్ పెట్టుకుని టీవీల ముందు కూర్చోవడమే.
సోనీ స్పోర్ట్స్‌తో పాటు సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, సోనీ టెన్ 4 ఛానెల్స్‌లో కూడా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ ఇవ్వనున్నారు. ఇక పాకిస్థాన్‌పై గెలిచి ఆసీస్‌పై ఓటమిని మర్చిపోయేలా చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That’s that from our first game at #CWG2022
Australia win by 3 wickets.#TeamIndia will look to bounce back in the next game.
Scorecard – https://t.co/cuQZ7NHmpB #AUSvIND #B2022 pic.twitter.com/p1sn3xS6kj
— BCCI Women (@BCCIWomen) July 29, 2022
I had tears with a smile and goosebumps with a lot of excitement.
It was a great great great honor to be the flag bearer of my beloved country Pakistan. Blessed 🙏🏻😇 #CommonwealthGames2022#PakistanZindabad 🇵🇰 pic.twitter.com/TXgsMlCqY7— Bismah Maroof (@maroof_bismah) July 28, 2022