ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాపై టెస్టు సిరీస్ ను గెలిచి ఎలాగైనా విమర్శలకు ధీటుగా జవాబు చెప్పాలని భావించింది. అందుకు తగ్గట్లుగానే తొలి టెస్ట్ లో 188 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టునున ఓడించింది టీమిండియా. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగో రోజు భారత్ ను వణికించిందనే చెప్పాలి. నాలుగో రోజు 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన బంగ్లా ఐదో రోజు ఆట ప్రారంభం అయిన 50 నిమిషాల్లోనే ఆలౌట్ అయ్యింది. దాంతో రెండు టెస్టు సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఐదో రోజు ఆట ప్రారంభం అయ్యింది. నాలుగో రోజు ఆటలో పైచేయి సాధించిన బంగ్లా బ్యాటర్లు చివరి రోజైన ఐదో రోజు భారత బౌలర్లకు 50 నిమిషాల్లోనే దాసోహం అయ్యారు. 272/6 ఓవర్ నైట్ స్కోర్ తో ఐదో రోజు ఆటను ప్రారంభించింది బంగ్లాదేశ్. అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న షకీబ్ అల్ హసన్ అర్ధశతకం సాధించి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో వైపు రెండో వన్డేలో సెంచరీ చేసిన మెహిదీ హసన్ ఉన్నారు. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే మూడో ఓవర్ లోనే సిరాజ్ మెహిదీ హసన్ (13)ను బోల్తా కొట్టించాడు.
ఆ తర్వాత వెంటవెంటనే బంగ్లా మిగిలిన వికెట్లను సైతం కోల్పోయింది. షకీబ్ ను (84), ఎబాదత్ హసన్(0) లను కుల్దీప్ పెవిలియన్ కు పంపించాడు. చివరి వికెట్ అయిన తైజుల్ ఇస్లామ్ ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దాంతో 324 పరుగుల వద్ద బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. 188 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయాగా రెండో ఇన్నింగ్స్ లో 258/2 రన్స్ కు డిక్లేర్డ్ ఇచ్చింది. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలగా.. రెండో ఇన్నింగ్స్ లో 324 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 8 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
🌟Kuldeep Yadav was adjudged the player of the match
🌟Axar Patel claimed the most wicket in the second innings for India#BANvIND pic.twitter.com/2XD6v2l9uP— CricTracker (@Cricketracker) December 18, 2022
A thumping win for India in the first Test. They take 1-0 unassailable lead in the two-match Test series.#BANvIND pic.twitter.com/lKcopHluw9
— CricTracker (@Cricketracker) December 18, 2022