శ్రీలంకను టీమిండియా వైట్‌వాష్ చేసి.. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన మరో 21 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టిమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు మాత్రమే చేసి చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఇండియా 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. టీ20ల్లో రోహిత్‌ను ఔట్ చేయడం చమీరాకు ఇది ఆరో సారి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయర్‌తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాక 18 పరుగులు చేసిన సంజూ శాంసన్ కరుణరత్నే బౌలింగ్‌లో వికెట్ కీపర్ చండీమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ క్రమంలో దీపక్ హుడా ఈ ఫార్మాట్‌లో తొలి సారి బ్యాటింగ్‌కు వచ్చాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన దీపక్ హుడా.. లహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫోర్, ఓ సిక్స్ ఉన్నాయి. అనంతరం వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఉందుకు నడిపించిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అయ్యర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అయితే ఆ కాసేపటికే వెంకటేశ్ అయ్యర్ (5) ఔటవడంతో ఇండియా 12.2 ఓవర్లలో 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
Shreyas Iyer vs Sri Lanka in the recently concluded T20I series.
Only Two players scored 3 unbeaten 50+ Scores in a 3 match T20I series:
1 – David Warner
2 – Shreyas Iyer& he was the only Indian to score 200+ runs in a 3 match T20I series.#ShreyasIyer #Shreyas #INDvSL pic.twitter.com/edzA687qUM
— Vtrakit Cricket (@Vtrakit) February 28, 2022
అనంతరం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన శ్రేయస్ అయ్యర్ టీంను విజయతీరాలకు చేర్చాడు. అయ్యర్ 73 పరుగులతో, జడేజా 22 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఒకానొక దశలో 12.1 ఓవర్లలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంకను కెప్టెన్ దసున్ శనక ఆదుకున్నాడు. చివరి వరకు ఆడి 9 ఫోర్లు, 2 సిక్సులతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మిగతావారిలో చండీమాల్ 25, కరుణరత్నే 12 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, సిరాజ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన శ్రేయస్..
ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయస్ అయ్యర్ ఒకసారి కూడా ఔట్ కాకపోవడం గమనార్హం. దీంతో పాటు ఒక అరుదైన రికార్డును కూడా శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. ఈ సిరీస్‌లో శ్రేయస్ 204 పరుగుల చేశాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 199 పరుగులతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌తో శ్రేయస్ ఆ రికార్డును కొల్లగొట్టాడు. మరి టీమిండియా విజయపథంపై, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
FIFTY!
Three consecutive half-centuries for @ShreyasIyer15 👏👏
Live – https://t.co/rmrqdXJhhV #INDvSL @Paytm pic.twitter.com/WjbDmJOdtU
— BCCI (@BCCI) February 27, 2022
That’s that from the final T20I.#TeamIndia win by 6 wickets to complete a clean sweep 3-0 against Sri Lanka.
Scorecard – https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/er1AQY6FmL
— BCCI (@BCCI) February 27, 2022