ప్రపంచ నంబర్ వన్‌గా నిలవడం గొప్ప విషయం. పైగా అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలో నిలవడం చరిత్ర. ఇప్పుడు అలాంటి చరిత్రనే టీమిండియా సాధించింది. హేమాహేమీలను వెనక్కినెట్టి.. ప్రపంచ అగ్రశ్రేణిగా నిలిచింది.
ఇండియాలో ప్రజలు క్రికెట్‌ను ఎంతలా ఇష్టపడతారో మాటల్లో చెప్పడం కష్టం. క్రికెటర్లను డేమి గాడ్స్‌లా భావిస్తారు. క్రికెట్‌ను మతంలా భావించే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇలా ప్రజల అభిమానం పొందడంలో వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న భారత జుట్ట.. ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఇండియానే నంబర్ వన్. మూడో ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలవడం నిజంగా గొప్ప విషయమే. ఇప్పటి వరకు టీ20లు, వన్డేల్లో నంబర్ వన్‌గా ఉన్న టీమిండియా తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరింది. 115 పాయింట్లతో టెస్టు ఫార్మాట్లో భారత్ నంబర్ స్థానాన్ని ఆక్రమించింది.
భారత్ తర్వాత 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్‌లో నిలిచింది. మూడో స్థానంలో ఇంగ్లండ్ 106 పాయింట్లతో ఉంది. 4వ స్థానంలో న్యూజిలాండ్ 100 పాయింట్లతో, 5వ స్థానంలో సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఉంది. అలాగే వన్డేల్లో 114 పాయింట్లతో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో 112 పాయింట్లతో ఆస్ట్రేలియా ఉంది. మూడులో న్యూజిలాండ్ 111 పాయింట్లతో ఉంది. 4లో ఇంగ్లండ్ 111 పాయింట్లతో, 106 పాయింట్లతో 5వ స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఇక టీ20 ఫార్మాట్లో ఇండియా 267 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. రెండో ప్లేస్‌లో ఇంగ్లండ్ 266 పాయింట్లతో ఉంది. అలాగే పాక్ 258 పాయింట్లతో 3వ స్థానంలో, 256 పాయింట్స్‌తో సౌతాఫ్రికా 4వ స్థానంలోనూ, 252 పాయింట్లతో న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉన్నాయి.
ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఇండియానే ప్రపంచ నంబర్ వన్‌గా ఉంది. అయితే మూడు ఫార్మాట్లలో ఒకే సారి నంబర్ వన్‌గా ఉన్న రెండో జట్టుగా భారత్ నిలిచింది. అలాగే ఆసియా నుంచి టీమిండియా తొలి జట్టుగా నిలిచింది. వీటితో పాటు ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్, ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్, ప్రపంచ నంబర్ వన్ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకులు కూడా భారత క్రికెటర్లే అధిరోహించారు. టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, టెస్టుల్లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉన్నారు. ఇలా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా దుమ్మురేపుతోంది. మరి ఈ ర్యాంకులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Number 1 Test team – India
Number 1 T20I team – India
Number 1 ODI team – India
Number 1 T20 batter – Surya
Number 1 ODI bowler – Siraj
Number 1 Test all-rounder – JadejaIndian cricket dominating the ICC rankings.
— Johns. (@CricCrazyJohns) February 15, 2023