IND vs ZIM 3rd ODI: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఇది తన కెరీర్ లో తొలి సెంచరీకాగా, ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో 130 పరుగులు సాధించాడు. దీంతో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఘనత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండేది. బులవాయో వేదికగా 1998లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు. అయితే.. తాజా మ్యాచ్లో గిల్ 130 పరుగులు చేయడంతో.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది.
Shubman Gill – 2022 ✅
Sachin Tendulkar – 1998 ✅
Ambati Rayudu – 2015 ✅Shubman Gill smashed the highest ODI score by an India batter (men’s) in Zimbabwe 🔥#ShubmanGill #India #ZIMvsIND #Cricket #ODIs pic.twitter.com/bD9QQ96lEz
— Wisden India (@WisdenIndia) August 22, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్ 130 పరుగులుచేయగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటర్లలో సికందర్ రాజా(115) పరుగులు చేయగా.. సీన్ విలియమ్స్ 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అన్వేష్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్.. తలా రెండు వికెట్లు తీశారు.
Shubman Gill scored a splendid 130 and is our Top Performer from the first innings 👏
A look at his batting summary here 👇👇#TeamIndia #ZIMvIND pic.twitter.com/Znz52wQjMo
— BCCI (@BCCI) August 22, 2022