భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు(శుక్రవారం) జరగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండు జట్లు తొలి గెలుపుకోసం పోటీ పడనున్నాయి. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో యువ భారత జట్టు వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది.
అయితే ఈ యంగ్ టీమిండియాను ఒక ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే.. వెస్టిండీస్‌పై టీమిండియా ఈ వన్డే సిరీస్‌లో విజయం సాధిస్తే.. ఒకే జట్టుపై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన టీమ్‌గా భారత్ ప్రపంచ రికార్డు సాధిస్తుంది. 2007 నుంచి భారత్ వెస్టిండీస్‌పై వరుసగా 11 వన్డేలు సిరీస్‌లు గెలిచింది. ఒక విధంగా ఇది కూడా ఇప్పుడు వరల్డ్ రికార్డే కానీ.. పాకిస్థాన్ కూడా జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచి మనతో పాటు సమానంగా ఉంది.
అదే ఇప్పుడు మనం వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటే.. ఒకే జట్టుపై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తాం. 90వ దశకంలో వెస్టిండీస్ మనపై ఆధిపత్యం చెలాయించేంది. కానీ.. గత రెండు దశాబ్దాలుగా వెస్టిండీస్‌పై మనదే పైచేయిగా నిలుస్తుంది. మరి ఈ జైత్రయాత్రను ఈ యంగ్ టీమిండియా కొనసాగిస్తుందో? లేదో? చూడాలి.
అలాగే ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా టీమిండియాను ఊరిస్తోంది. శుక్రవారం జరిగే తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే.. విదేశాల్లో ఒకే గ్రౌండ్‌లో అత్యధిక విజయశాతం నమోదు చేసిన జట్టుగా భారత్ నిలవనుంది. 2007 నుంచి భారత్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో 9 విజయాలు, 2 ఓటమలు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో ప్రస్తుతం ఆ గ్రౌండ్‌లో భారత్ విన్నింగ్ లాస్ రేషియో 4.50గా ఉంది. తొలి వన్డేలో వెస్టిండీస్‌ను ఓడిస్తే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్ విన్నింగ్ లాస్ రేషియో 5కు చేరుకుంటుంది. దీంతో మరో వరల్డ్ రికార్డు భారత్ వశం అవుతుంది.
2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత్ బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓడిన రెండు మ్యాచ్‌లు కూడా ఈ గ్రౌండ్‌లోనే జరిగాయి. ఆ పీడకలకు ఈ మైదానమే సాక్ష్యం. ఇక ఆ రెండు ఓటముల తర్వాత ఈ గ్రౌండ్‌లో భారత్‌కు ఓటమనదే ఎరుగదు. మరి వెస్టిండీస్‌పై విజయాలతో భారత్ ఈ రెండు వరల్డ్ రికార్డును సాధిస్తుందని మీ భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The #WIvIND ODI series begins tomorrow! 👍 👍
Drop a message in the comments below & cheer for #TeamIndia. 👏 👏 pic.twitter.com/fYudJX0De8
— BCCI (@BCCI) July 21, 2022