గాలే వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విచిత్రకరమైన రీతిలో అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇమామ్ ఉల్ హక్ బద్దకంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్‌ను మించిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీలంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ కూల్‌గా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నాడు. స్కోర్ బోర్డ్‌పై అజేయంగా 68 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీసేందుకు 29వ ఓవర్‌లో రమేష్ మెండీస్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీ ఫలితాన్ని ఇచ్చింది.
ఆ బాల్‌ను ఆడబోయి ఇమామ్ మిస్ అయ్యాడు. బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. ఆ తర్వాత ఇమామ్ అనవసరంగా క్రీజ్‌లో ఉన్న కాలు కదిపాడు. అది గమనించిన కీపర్ నిరోషన్ డిక్వెల్లా బెల్స్‌ను గిరాటేశాడు. కాలు క్రీజ్‌లోనే ఉంటే స్టంపింగ్ చేశాడేంటి అంటూ లంక ఆటగాళ్లు సైతం కీపర్ అప్పీల్‌కు మద్దతు తెలపలేదు. కానీ కీపర్ డిక్వెల్లా మాత్రం గట్టిగా అప్పీల్ చేయడంలో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయడంతో కీపర్ స్టంపింగ్ చేసే సమయానికి ఇమామ్ కాలు గాల్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇమామ్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
ఇలా నిర్లక్ష్యం, బద్దకంతో ఇమామ్ తన వికెట్‌ను తానే చేజేతులా సమర్పించుకున్నాడు. గతంలో పాక్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్ కూడా ఇలానే వికెట్ల మధ్య బద్దకంగా పరిగెత్తుతూ అనేక సార్లు రనౌట్ అయ్యాడు. స్టంప్ అవుట్లు కూడా చాలానే అయ్యాడు. విచిత్రం ఏమిటంటే ఇమామ్ ఉల్ హక్, ఇంజుమామ్ ఉల్ హక్ ఇద్దరూ దగ్గరి చుట్టాలే. కాగా నిర్లక్ష్యంగా కదిలి అవుట్ అయిన ఇమామ్ ఉల్ హక్‌పై నెటిజన్లు సెటైర్లతో రెచ్చిపోతున్నారు. క్రీజ్‌లో ఉన్నప్పుడు కాస్త మెళుకువతో ఉండాలని చురకలంటిస్తున్నారు. మరి ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What happened to Imam-ul-Haq in today’s match and the conspiracy against him is unacceptable in any case. ICC is requested to take action against him and whoever did this should be severely punished.Because he is not out foot is clearly grounded. #ICC #PCB #PAKvSL #Imamulhaq pic.twitter.com/4MVBszQAOJ
— Imran Khan (@Imran_Khan00100) July 19, 2022