ఆస్ట్రేలియాతో మూడు టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీలో ఆడుతున్న భారత్.. తొలి మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల విధ్వంసకర బ్యాటింగ్ తో భారీ స్కోర్ ని నమోదు చేయగలిగింది. ఒకవైపు ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మరోవైపు ఓపెనర్ గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 9 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా వెంటనే పెవిలియన్ చేరుకున్నాడు. 7 బంతులు ఆడిన కోహ్లీ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తో ఊపు మీదున్న ఫ్యాన్స్ కోహ్లీ అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు.
అయితే ఆ తర్వాత దిగిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతులకి 46 పరుగులు చేసి భారత్ కి మంచి స్కోర్ ని అందించాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. దీంతో మ్యాచ్ ఏంటని అందరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు దిగాడండి హార్దిక్ పాండ్యా. తన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ని నిలబెట్టడానికి వచ్చిన బాహుబలిలా కనిపించాడు. ఇన్నింగ్స్ బాధ్యత నాది అంటూ భుజాల మీద వేసుకున్నాడు.
5 సిక్సులు, 7 ఫోర్లు కలిపి మొత్తం 30 బంతుల్లో 71 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. చివరి ఓవర్ లో ఆఖరి 3 బంతుల్లో హ్యాట్రిక్ సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి భారత్ 208 పరుగుల భారీ స్కోర్ ని చేయగలిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుంది. మరి ఆఖరి ఓవర్ లో చివరి మూడు బంతుల్లో హార్దిక్ పాండ్యాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే భారత్ ఇచ్చిన ఈ భారీ స్కోర్ ని ఆస్ట్రేలియా బీట్ చేస్తుందా? లేదా? కామెంట్ చేయండి.
𝗬𝗼𝘂 𝗝𝘂𝘀𝘁 𝗖𝗮𝗻 𝗡𝗼𝘁 𝗠𝗶𝘀𝘀 𝗧𝗵𝗶𝘀! @hardikpandya7 creamed 7⃣ Fours & 5⃣ Sixes to hammer 7⃣1⃣* off 3⃣0⃣ balls! ⚡️ 🎇 #TeamIndia | #INDvAUS
Watch that stunning knock 🔽https://t.co/C1suCKBPK7 pic.twitter.com/3o86bZEIzn
— BCCI (@BCCI) September 20, 2022