భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా అనేక గొప్ప విజయాలు సాధించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011, చాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్లలో ఇండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు. అలాగే ధోని కెప్టెన్‌గా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్ గెలిచింది. కెప్టెన్ కూల్‌గా, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా, మ్యాచ్‌లో మంచి ప్యూహ కర్తగా పేరు తెచ్చుకున్న ధోనిని ఎన్నో ఆశలతో టీమిండియాకు మెంటర్‌గా నియమించింది బీసీసీఐ. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు ధోనిని జట్టు మెంటర్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో జట్టుకు కొండంత అండ వచ్చినట్లు అయిందని అంతా భావించారు. ఇక టీమిండియా ఈ సారీ కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
సగటు క్రికెట్ అభిమానులు ఇలా ఆలోచించడంలో తప్పేమి లేదు. ఎందుకంటే ధోని సాధించిన రికార్డులు, గతంలో టీమిండియాను విజయపథంలో నడిపిన తీరును చూస్తే ఎవరైనా ధోని జట్టుతో ఉండడం కచ్చితంగా ప్లస్‌పాయింట్ అనే అనుకుంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి కథ పూర్తిగా అడ్డం తిరిగింది. మెంటర్‌గా ధోని జట్టుకు బలం కంటే బలహీనతగా మారినట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, మెంటర్‌గా ధోని ఇలా ముగ్గురు హేమాహేమీల మధ్య ఏకభిప్రాయం కుదరడం అంతే తేలికైన విషయం కాదు. ధోని రాకకంటే ముందు కోహ్లీ మాటే వేదంగా ఉండేది. కోచ్‌గా శాస్త్రి ఉన్నా కూడా విరాట్ తీసుకునే నిర్ణయాలు ఫైనల్‌గా నిలిచేవి. కానీ ధోని రాకతో జట్టులో ఇన్‌బ్యాలెన్స్ చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. మెంటర్‌గా ధోని నియామకం బెడిసికొట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: హార్దిక్ పాండ్యా చేసిన అతి పెద్ద పొరపాటు.. మూల్యం చెల్లిస్తున్న టీమిండియా!
అలాగే ధోని నిర్ణయాలను, సలహాలను విరాట్, కోచ్ శాస్త్రి పట్టించుకోలేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ధోని నియామకంతో టీమిండియాపై ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుతానికి జట్టులో ఏదో తెలియని లోటు ఉన్నట్లు ధోనిని మెంటర్‌గా తీసుకురావడంతో జట్టు కొంచెం సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్లు కనిపించింది. దానికి తోడు పాక్‌తో మ్యాచ్ ఒత్తిడి. ఇలా ధోని జట్టుకు భారంగా మారాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రితో చర్చలు జరుపుతున్నట్లు, ఇషాన్ కిషన్, పంత్‌కు కోచింగ్ ఇస్తూ కనిపించిన ధోని జట్టులో చోటు చేసుకున్న మార్పులకు కారణం అయిఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన ఆందోళన కరంగా ఉన్నా కూడా ధోని ఏ ఆటగాడితో కూడా మాట్టాడి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో చేప్పిన దృశ్యాలు కనిపించలేదు. సరే ఆ మ్యాచ్‌లో అంతను అంతగా ఇన్‌వాల్వ్ కాలేదు అనుకున్నా.. ఆదివారం న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు కూర్పుపై ధోని ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యత అంతా తానే తీసుకున్నట్లు మ్యాచ్‌కు ముందు కెమెరా దృశ్యాలు చూస్తే అర్థం అవుతోంది. ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమే అయినా.. ఓపెనర్‌గా రోహిత్‌ను ఆపి కేఎల్ రాహుల్, ఇషాన్ రావడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అనంతరం కోహ్లీ స్థానంలో వచ్చిన రోహిత్ కూడా విఫలం అయ్యాడు. అతని దారిలోనే కోహ్లీ కూడా నడిచాడు. ఇలా జట్టు ప్రధాన బలమంతా కుప్పకూలింది.
ఇదీ చదవండి: న్యూజిలాండ్ తో మ్యాచ్ సమయంలో నిద్రపోయిన కోచ్ రవిశాస్త్రి.. పిక్ వైరల్!
అలాగే హార్థిక్ పాండ్యాను ధోనినే పట్టుబట్టి మరీ తుది జట్టులో ఉంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గాయంతో బౌలింగ్ సరిగా వేయలేకపోతున్న పాండ్యా, బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలం అవుతున్నాడు. అయినా కూడా అతన్ని జట్టులో ఉంచడం వెనుక ధోని బలవంతమే ఉన్నట్లు తెలుస్తోంది. మెంటర్‌గా ధోని తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయా? లేదా ధోని సలహాలు కోహ్లీ, రవిశాస్త్రి అమలు చేయలేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఏమైనప్పటికీ మెంటర్‌గా ధోని ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంటే ఒక మెంటర్‌గా ఆటగాళ్లతో చర్చించి, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు తగిన సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో మాట్టాడుతూ మాత్రమే కనిపించాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఏకంగా వారం రోజుల వ్యవధి దొరికినా కూడా జట్టు ప్రదర్శనలో మార్పు రాలేదు. అంటే ఈ సమయంలో తన బలహీతనలను అంచనా వేసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మెంటర్‌గా ధోని చేయలేదా అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరి మెంటర్‌గా ధోని పనితీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 2014 నుంచి టీమిండియా ఓడిన ప్రతి నాకౌట్ మ్యాచ్ ఆన్ ఫీల్డ్ అంపైర్ అతనే..