ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ కాస్త వాయిస్‌లో బేస్ పెంచాడు. టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఏ విధంగా ఓడించిందో.. మూడో టెస్టులో అదే విధంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. పిచ్‌లను పూర్తి స్పిన్ ట్రాక్‌లుగా తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నా.. టీమిండియా ఓటమి పాలవడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మూడో టెస్టు విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటే.. టీమిండియా మాత్రం నాలుగు టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఓటమి, పిచ్‌పై జరుగుతున్న చర్చపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ స్పందిస్తూ.. టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
చాపెల్ మాట్లాడుతూ..‘ఇండోర్ టెస్టులో తాము చేసిన తప్పులను టీమిండియా తెలుసుకోవాలి. ఈ సిరీస్‌లో టీమిండియా వారికి అనువైన పిచ్‌లను తయారు చేయించుకుంటున్న విషయాన్ని నేను ఎప్పుడో చెప్పా. అయినా ఆస్ట్రేలియాలో టీమిండియా రెండు సిరీస్‌లు గెలిచిన విషయాన్ని వాళ్లు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత్ ఆసీస్‌లో రెండు సిరీస్‌లు గెలిచింది. అయినా.. పిచ్‌ల గురించి క్యూరేటర్‌కి వదిలేయాలి. అసలు పిచ్ విషయంలో ఆటగాళ్లకు, కోచ్‌లకు సంబంధం ఏంటి? ఎలాంటి పిచ్ తయారు చేయాలో క్యూరేటర్ నిర్ణయించుకుంటాడు. ఏ ట్రాక్ అతనికి మంచిగా అనిపిస్తే అదే పిచ్‌ను సిద్ధం చేస్తాడు.
అలాంటి ట్రాక్‌పైనే ఇరు జట్లు ఆడాలి. అంతేకానీ.. పిచ్ తమకు అనుకూలంగా ఉండాలని మొండిపట్టు పట్టకుండా, మ్యాచ్ ఓడితే పిచ్ క్యూరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. అయినా టీమిండియాలో రిషభ్ పంత్ లేకపోవడంతో వారికి పెద్దలోటు. మూడో టెస్టులో టీమిండియా పంత్‌ను బాగా మిస్ అయింది. ఇప్పటికైనా పిచ్ సంగతి పక్కనపెట్టి టీమిండియా ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలని’ చాపెల్ అన్నాడు. కాగా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమయం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. టీమిండియా ఎలాగైన గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో ఉంది. మరి చివరి టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. మరి టీమిండియాపై చాపెల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 IND vs AUS: ‘The Indians need to shut up and get on with the cricket’ says Ian Chappell pic.twitter.com/j5U5oJCGGa
— MegaNews Updates (@MegaNewsUpdates) March 3, 2023