ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అనగా ఈ నెల 7 న ఈ ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలబడనున్నాయి. అయితే ఇప్పుడు అభిమానులకి ఒక విషయంలో ఊరట కలిగించనున్నారు. ఈ ఫైనల్ ని క్రికెట్ లవర్స్ ఫ్రీగా చూసే అవకాశం కలిపించారు.
2019 ప్రపంచ కప్ లో రాయుడికి స్థానం దక్కలేదు. అంతటితో బ్యాడ్ లక్ అని సరిపెట్టుకున్నా.. శిఖర్ ధావన్ గాయపడడంతో ఒక బ్యాటర్ ప్లేస్ లో విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేశారు. దీంతో తెలుగోడి అన్యాయం జరిగిందని అందరూ బాధపడ్డారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వికెట్ కీపర్ అయినటువంటి భరత్ కి డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కడం లేదని తెలుస్తుంది.
ఆస్ట్రేలియాతో.. భారత్ ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అభిమానులతో పాటుగా క్రికెట్ నిపుణులు, దిగ్గజాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 న లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే ఈ మ్యాచులో విన్నర్ ఎవరనే సందేహం నెలకొంది.
డబ్ల్యూటీసి ఫైనల్ మరో 2 వారాల్లో రానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేయగా.. తాజాగా టీంఇండియా జట్టులోని కొంతమంది సభ్యులు ఈ మ్యాచ్ కోసం లండన్ చేరుకున్నారు. అయితే తాజాగా..ఈ ఫైనల్ కి సంబంధించిన ప్రైజ్ మనీ ఐసీసీ ప్రకటించేసింది.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా కూడా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. ఎందుకంటే భారత్‌తో ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్ చేరింది. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు న్యూజిలాండ్‌కు, కేన్ విలియమ్సన్‌కు థ్యాంక్యూలు చెప్పారు. కానీ.. అలాంటి అవసరం ఏం లేదంటున్నారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా.. టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది. అది కేన్ విలియమ్సన్ కష్టంతో.. అందుకే భారత క్రికెట్ అభిమానులు కేన్ మామకు థ్యాంక్యూ చెబుతున్నారు. అయితే.. న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం.. టెస్టు క్రికెట్ చరిత్రలో బెస్ట్ మ్యాచ్ అనేలా జరిగింది.
ప్రస్తుతం భారతదేశం రెండు శుభవార్తలతో పట్టలేని సంతోషంతో ఊగిపోతుంది. ఒక వైపు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం.. మరోవైపు క్రికెట్‌లో టీమిండియాకు అందిన గుడ్‌న్యూస్‌తో ఇండియా సంబురాల్లో మునిగిపోయింది.
2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా ట్రోఫీ సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం భారత్‌కు వచ్చింది. అయితే.. అప్పుడు మన ప్రత్యర్థి వల్ల మిస్ అయిన ట్రోఫీ ఇప్పుడు వారి వల్లే దక్కేలా ఉంది.
పదే పదే గాయాల బెడదతో జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై, భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతానికి బుమ్రాను మర్చిపోవడమే మంచిదని.. అతడు తిరిగి జట్టులోకి వచ్చాక అప్పుడు తుది జట్టులో అతని స్థానం గురుంచి మాట్లాడటం మంచిందని వ్యాఖ్యానించాడు.