ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెంది ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరితో కమ్యూనికేట్ అయ్యేందుకు భాష ఎంతో ప్రధానం. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష, టెక్నాలజీల్లో వాడే భాష ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ కీర్తించబడుతోంది. రాష్ట్రం దాటినా, దేశం దాటినా ఇంగ్లీష్ రాకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. పైగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ అయిపోయింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెటర్లకు ఇంగ్లీష్ వచ్చి తీరాలనే విధంగా ఉంది పరిస్థితి. వివిధ దేశాలతో క్రికెట్ ఆడేందుకు వెళ్లి, అక్కడ మంచి ప్రదర్శన కనబర్చి.. ప్రజెంటేషన్ సెర్మనీలో మాట్లాడాలన్న ఇంగ్లీష్ వస్తే ఈసీ అవుతుంది.
కానీ.. కొంతమంది క్రికెటర్లు గ్రామస్థాయి నుంచి క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి వేగంగా జాతీయ జట్లకు ఆడుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లీష్ అంతగా రాదు. టీమిండియాలోనూ ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన, పడుతున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ విషయంలో అందరి కంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ.. హేళనకు గురవుతున్న వారు మాత్రం పాకిస్థాన్ క్రికెటర్లని చెప్పవచ్చు. గతంలో, ఇప్పుడు ఇంగ్లీష్ రాక, తప్పుగా మాట్లాడి పాక్ క్రికెటర్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా పాక్ యంగ్ బౌలర్ నసీమ్ షా సైతం ప్రెస్ మీట్‌లో తనకు ఇంగ్లీష్ రాదని చెప్పాడు. దాంతో కొంతమంది మీమర్లు అతనిపై జోక్స్ పేల్చారు. అయితే.. పాకిస్థాన్ మరో మాజీ క్రికెటర్, ఒకప్పటి వరల్డ్ నంబర్ వన్ బౌలర్ సయీద్ అజ్మల్‌కు సైతం ఇంగ్లీష్ రాకపోయేది.
అయితే క్రికెటర్లకు ఇంగ్లీష్ రావడం, వారు నేర్చుకోవడం ఎంత వరకు అవసరం అని ఎదురైన ప్రశ్నకు సయీద్ అజ్మల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘ఇంగ్లీష్ లాంగ్వేజ్’ ఆ పదమంటేనే నాకు ద్వేషం. క్రికెటర్లకు ఆట తెలస్తే చాలా ఇంగ్లీష్ కచ్చితంగా రావాల్సిన అవసరం లేదు. నేను వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న సమయంలో ఎంతమంది గొప్పగొప్పొళ్లు తనను ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పారని.. కానీ.. తాను తనకి నచ్చింది మాత్రమే చేస్తానని చెప్పినట్లు వెల్లడించాడు. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అంటే ప్రపంచమే మన దగ్గరికి వస్తుందని, మనం ప్రపంచ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, తన మాతృ భాషలో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే రండి, లేకుంటే మీ ఇష్టం అని చెప్పినట్లు అజ్మల్ పేర్కొన్నాడు. కాగా.. ఇంగ్లీష్‌పై అజ్మల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2009 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన అజ్మల్.. 35 టెస్టుల్లో 178, 113 వన్డేల్లో 184, 64 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. మరి అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Saeed Ajmal feels the players were judged more on the basis of language skills instead of their cricket.#Cricket #SaeedAjmal #PakistanCricket #TeamPakistan pic.twitter.com/zEnsLYoiYd
— CricTelegraph (@CricTelegraph) December 15, 2022
How important is speaking English for a cricketer? #UltraEdgePodcast pic.twitter.com/A4JhORZcPf
— Roha Nadeem (@RohaNadym) December 14, 2022