టీమిండియా అండర్ 19 అమ్మాయిలు మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించారు. పురుషల క్రికెట్‌లోనూ కూడా తొలి సారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌ను మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియానే కైవసం చేసుకుంది. ఇప్పుడు అండర్ 19 మహిళల క్రికెట్‌లో ప్రవేశ పెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ను షఫాలీ వర్మ కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంతో ఇండియన్ అండర్ 19 మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని రంగాలకు చెందిన వారు.. షఫాలీ వర్మ అండ్ టీమ్‌ను అభినందిస్తున్నారు. బీసీసీఐ ఈ టీమ్‌కు రూ.5 కోట్ల నజరానాను సైతం ప్రకటించింది.
అయితే.. ఈ వరల్డ్ కప్‌లో షఫాలీ వర్మ పాల్గొనడంపై చర్చలు మొదలయ్యాయి. షఫాలీ అండర్-19 వరల్డ్ కప్ ఆడి చీటింగ్ చేసిందంటూ.. కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు కారణం షఫాలీ వర్మ ఇప్పటికే టీమిండియా తరఫున పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. ఒక స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన తర్వాత కూడా.. అండర్ 19 వరల్డ్ కప్‌లో యువ క్రికెటర్లతో కలిసి ఆడటంతో ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే.. అండర్ 19 క్రికెట్‌లో 19 ఏళ్లు అంతకంటే తక్కువ ఉన్న ఏ ప్లేయర్ అయినా పాల్గొనవచ్చు. ఆ విషయం షఫాలీ వర్మపై విమర్శలు చేసే వారికి కూడా తెలుసు. కానీ.. ఇప్పటికే అంతర్జాతీయంగా రెండు టెస్టు మ్యాచ్‌లు, 21 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ కేవలం ఇండియా కప్ గెలవాలనే ఆలోచనతో యువ క్రికెటర్లతో పోటీ పడటం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు.
ఉమెన్స్ క్రికెట్‌లో పెద్ద టీమ్స్‌గా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లు అత్యుత్తమ బౌలింగ్‌ను ఎదుర్కొన్న షఫాలీ వర్మకు.. అండర్ 19లో యువ క్రికెటర్ల బౌలింగ్‌ను ఎదుర్కొవడం పెద్ద విషయం కాదు. అండర్ 19కి క్రికెట్‌కు వయసు ప్రధాన అర్హత కావచ్చు కానీ.. నైతికంగా షఫాలీ వర్మ అండర్ 19 వరల్డ్‌కప్ ఆడటం సరికాదని వారి వాదన. అయితే.. 19 ఏళ్ల షఫాలీ వర్మ అండర్ 19 వరల్డ్ కప్‌లో పాల్గొనడంలో ఎలాంటి తప్పు లేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ టీమ్‌లో ఆడిన క్రికెటర్ మళ్లీ వెనక్కి వెళ్లి అండర్ 19 ఆడటం అనేది గొప్ప విషయమని అందుకు షఫాలీని అభినందించాలని అంటున్నారు. 19 ఏళ్లు అంతకంటే తక్కువ ఉన్న ఏ ప్లేయర్ అయినా అండర్ 19 ఆడవచ్చని, షఫాలీ లాంటి ప్లేయర్లతో ఆడటం వల్ల ఇతర ప్లేయర్లకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ క్రికెట్ అందుతుందని అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే పురుష క్రికెటర్లు ఖాళీ దొరికితే.. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం లేదా అని విమర్శలు చేసే వారిని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India, this is for you! 🏆❤️#U19T20WorldCup pic.twitter.com/LZrox6Z32b
— Shafali Verma (@TheShafaliVerma) January 30, 2023