టీ20 వరల్డ్ కప్2022 లో విఫలం చెందిన టీమిండియాపై విమర్శల వర్షం ఆగడంలేదు. ఓ వైపు పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ దిగ్గజాలు మాటలతో దాడి చేస్తున్నారు. మరో వైపు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం భారత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. టీమిండియా అత్యంత పేలవమైన జట్టని, వారికి ఉన్న నైపుణ్యంతో టీ20లు ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు వాన్. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ వాన్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ.. కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా వాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. మేం విమర్శలను గౌరవిస్తాం అంటూ నొప్పితెలియకుండానే మాటల తూటాలు పేల్చాడు పాండ్యా.
మైఖేల్ వాన్.. ఏ జట్టుపై ఎప్పుడెప్పుడు విమర్శలు చేద్దామా అని పనిగట్టుకుని ఉంటాడు ఈ ఇంగ్లీష్ క్రికెటర్. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఒడిపోవడంతో.. తాజాగా తన నోటికి పనిచెప్పాడు. 2023లో జరిగే వరల్డ్ కప్ లో భారత్ ను భారత్ లోనే ఒడించి కప్ కొడతామని, వరల్డ్ కప్ వచ్చిందంటే చాలా టీమిండియానే ఫేవరెట్ అనడం నానెన్స్ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు వాన్. ఈ నేపథ్యంలోనే మైఖేల్ వాన్ విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.”జట్టు ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. ఇవి సహజం. అయితే ఆ విమర్శలను మేం గౌరవిస్తాం. టీమిండియా క్రికెట్ లో కొత్తగా రుజువు చేసుకోవాల్సింది ఏమీ లేదు. మా తప్పులు సరిదిద్దుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం” అంటూ పాండ్యా వ్యాఖ్యానించాడు.
Captain Hardik Pandya shuts Michael Vaughan’s mouth for his India biggest underperformers — People who have no self-respect , filled with hate in their heart and mind would comment like this. These ignorant filthy minded should be ignored
— Shivaram Manjunath (@ShivaramManjun2) November 16, 2022
మేం ప్రొఫెషనల్ ప్లేయర్లం. గెలుపోటములు సమానంగా స్వీకరిస్తాం మిస్టర్ వాన్ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఇక ఈ టీ20 ప్రపంచ కప్ మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచందని తెలిపాడు. మేం విమర్శలను గౌరవిస్తాం కానీ ఆ విమర్శలు హద్దులు దాటినప్పుడు కచ్చితంగా వాటికి ధీటైన జవాబులు ఇస్తాం అంటూ కాస్తా ఘాటుగానే బదులిచ్చాడు స్టార్ ఆల్ రౌండర్ పాండ్యా. ఇక వాన్ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని, ఒక్కసారి చరిత్ర తెలుసుకో అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. టీమిండియాకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.