ఆల్‌రౌండర్ అనే మాటకు తన పేరును పర్యాయపదంలా వాడాలనే విధంగా హార్దిక్ పాండ్యా పాకిస్థాన్‌పై చెలరేగాడు. తొలుత బౌలింగ్‌లో నిలకడగా ఆడుతున్న పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాలను అవుట్ చేసి పాకిస్థాన్ కోలుకోకుండా చేసిన పాండ్యా.. బ్యాటింగ్‌లో చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి నరాలు తెగే ఉత్కంఠలో కూడా అద్భుతంగా ఆడి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కానీ సరిగ్గా ఏడాది క్రితం పాండ్యా ఉన్న పరిస్థితికి ఇప్పుడు పాండ్యా ఉన్న పరిస్థితి పరిశీలిస్తే.. అతను కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు కచ్చితంగా స్ఫూర్తిని కలిగిస్తుంది.
2018లో ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ.. కాలు జారి కింద పడి కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. వెంటనే అక్కడి సహాయ సిబ్బంది వచ్చి పాండ్యాను స్టెచర్‌పై గ్రౌండ్ బయటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి పాండ్యా కెరీర్ తిరోగమనం వైపు సాగింది. ఈ కఠిన పరిస్థితి నుంచి కోలుకున్న పాండ్యా.. మునుపటిలా ప్రభావం చూపలేకపోయాడు. బౌలింగ్‌కు దూరంగా ఉండిపోయాడు. బ్యాటింగ్‌లో కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియాలో ఎంతో కీలకమైన ఆల్‌రౌండర్ స్థానంలో జట్టులో కొనసాగుతూ ఆ రోల్‌కు న్యాయం చేయలేకపోయాడు. దీంతో పాండ్యా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. జట్టుకు భారంగా మారిపోయాడంటూ అతనిపై విమర్శల వర్షం కురిసింది.
2021 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడు. చాలా కాలంగా ముంబైకు ఆడుతున్న పాండ్యాను.. ఆ టీమ్ వదిలించుకుంది. ఐపీఎల్ 2022 కోసం పాండ్యాను రిటేన్ చేసుకోలేదు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లోనూ పాండ్యా విఫలం అయ్యాడు. అనంతరం గాయాలు తిరగబెట్టడంతో బౌలింగ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అవ్వడంతో జట్టులో ఆల్‌రౌండర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇలా గాయాలు, పూర్ ఫామ్‌తో పాండ్యా టీమిండియాలో స్థానం కోల్పోయాడు. వెన్నుముకకు శస్త్రచికిత్స అనంతరం ఐపీఎల్ 2022కు సిద్ధమైన పాండ్యా.. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా గుజరాత్‌ను ముందుడి నడిపించాడు. ఆ జట్టును ఏకంగా ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
ఐపీఎల్ 2022 ప్రదర్శన ఆధారంగా తిరిగి టీమిండియాలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియాకు కెప్టెన్సీ కూడా వహించాడు. అనంతరం వెస్టిండీస్ టూర్‌లోనూ రాణించాడు. ఇప్పుడు తాజాగా ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌తో షోతో టీమిండియాను గెలిపించాడు. వెన్నుముక గాయంతో ఆటపై పట్టు కోల్పోయిన పాండ్యా.. సర్జరీ తర్వాత పట్టుదల, కఠోర శ్రమతో బ్యాటింగ్, బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధపెట్టి.. తన పునారగమాన్ని ఐపీఎల్‌లో ఘనంగా ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త హార్దిక్ పాండ్యాను చూస్తున్నాం. ఇలా ఇదే ఆసియా కప్, ఇదే పాకిస్థాన్ టీమ్‌తో నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌తో కెరీర్‌లో వెనుకబడ్డ పాండ్యా.. మళ్లీ అదే ఆసియా కప్ అదే పాక్ జట్టుపై సింహగర్జనతో మ్యాచ్ గెలిచి హీరో అయ్యాడు. సెట్ బ్యాక్ కంటే కమ్‌బ్యాక్ ఎంతో గొప్పదని చాటి చెప్పాడు. ఇదే విషయాన్ని పాండ్యా కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. మరి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పాండ్యా ప్రదర్శనపై, అతని కమ్‌బ్యాక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: చివరి ఓవర్‌లో హార్దిక్ కాన్ఫిడెన్స్! DK.. నేను ముగిస్తా అంటూ భరోసా!
The comeback is greater than the setback 🇮🇳 pic.twitter.com/KlnD4GZ4ZO
— hardik pandya (@hardikpandya7) August 29, 2022