హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు వాలెంటైన్స్ డే రోజున మరోసారి పెళ్లి చేసుకున్నారు. గతంలో 2020లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో పాండ్యా దంపతులు వేసిన హాట్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మెున్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లు పెళ్లి పీటలు ఎక్కితే.. తాజాగా ప్రేమికుల రోజున పెళ్లి పీటలు ఎక్కాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. అదేంటి పాండ్యాకు వివాహం అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడుగా అని మీకు డౌట్ రావొచ్చు. మీ అనుమానం నిజమే పాండ్యా పెళ్లై ఒక కొడుకు కూడా ఉన్నాయి. 2020లో కరోనా కారణంగా కొద్ది మంది సమక్షంలోనే బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ను వివాహం చేసుకున్నాడు పాండ్యా. ఇక ఇప్పుడు అందరి సమక్షంలో అంగరంగ వైభంగా తన వివాహ వేడుకును జరుపుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం సంగీత్ లో పాండ్యా దంపతులు వేసిన హాట్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు వాలెంటైన్స్ డే రోజున మరోసారి పెళ్లి చేసుకున్నారు. గతంలో 2020లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి నాటికి కరోనా తీవ్రంగా ఉండటంతో.. అతి కొంది మంది బంధువులు, అతిథుల మధ్య వీరి పెళ్లి జరిగింది. దాంతో నిరాశ చెందిన ఈ దంపతులు ఎలాగైన తమ వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా తమ పెళ్లిని మరోసారి జరుపుకున్నారు. ప్రేమికుల రోజునే పాండ్యా-నటాషాలు రెండో సారి పెళ్లి చేసుకోవడం విశేషం.
ఇక ఈ పెళ్లికి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు అతిథులుగా హాజరైయ్యారు. ఈ పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో పాండ్యా దంపతులు వేసిన హాట్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైట్ డ్రెస్ లో నటాషా బ్యూటీఫుల్ గా ఉంటే.. బ్లాక్ కోట్ లో హాలీవుడ్ హీరోలా మెరిశాడు పాండ్యా. వీరిద్దరు కలిసి ఓ సాంగ్ కు చిందేశారు. మరో వీడియోలో పాండ్యా మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసి పెళ్లికి వచ్చిన అతిథులను అలరింపజేశాడు. ఈ వేడుకలో యువరాణిలా మెరిసింది నటాషా. ఇక పాండ్యా దంపతులకు ఓ కొడుకు ఉన్న సంగతి కూడా మనందరికి తెలిందే. మరి పాండ్యా దంపతుల హాట్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HardikPandya and #natashastankovic’s after party sure looked super fun! Watch the happy couple dance their hearts out here! #TrendingNow #HardikPandya𓃵 #hardikpandyawedding pic.twitter.com/pSX5RsnJ8n
— Pinkvilla (@pinkvilla) February 15, 2023
Here’s a little glimpse into #HardikPandya𓃵 and #NatasaStankovic’s special day 😍♥️#TrendingNow #HardikPandyawedding #NatasaStankovic pic.twitter.com/Z16zEXz8wc
— Pinkvilla (@pinkvilla) February 15, 2023