SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gautam Gambhir Robin Uthappa Chase Down 158 Runs Against Asia Lions In Llc 2023

గంభీర్‌-ఊతప్ప విశ్వరూపం.. పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేశారు!

చాలా కాలం తర్వాత మరోసారి పాకిస్థాన్‌ బౌలర్లపై గౌతమ్‌ గంభీర్‌ కసితీరా బ్యాటింగ్‌ చేశాడు. గంభీర్‌ బాదుడికి అక్తర్‌, ఆమీర్‌, తన్వీర్‌, హఫీజ్‌ ఎకానమీ 10కి పైనే మారిపోయింది. గంభీర్‌కు ఊతప్ప కూడా జతకలిసి.. ఇండియా మహరాజాస్‌ లెజెండ్స్‌ లీగ్‌లో తొలి విజయం సాధించింది.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 15 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గంభీర్‌-ఊతప్ప విశ్వరూపం.. పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేశారు!

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి పాక్‌ బౌలర్లను కసితీరా బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినంత కాలం.. పాక్‌తో మ్యాచ్‌ అంటే అదేదో యుద్ధంలా భావించి ఆడే గంభీర్‌.. ఆట నుంచి రిటైర్‌ అయినా కూడా తన పంథా మార్చుకోలేదు. వచ్చిందే ఛాన్స్‌ అన్నట్లు మరోసారి పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై విరుచుకుపడ్డాడు. అందుకు గంభీర్‌ ఓపెనింగ్‌ పార్ట్నర్‌ రాబిన్‌ ఊతప్ప కూడా జతకలిశాడు. ఇద్దరూ కలిసి పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఊచకోత కోశారు. మాజీ క్రికెటర్లంతా కలిసి లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇండియా మహరాజాస్‌కు గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

మాజీ క్రికెటర్లతో లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ జరుగుతున్న విషయంతో మార్చి 10న మొదలైన ఈ టోర్నీ 20 వరకు జరుగుతుంది. ఇండియా మహరాజాస్‌, ఆసియా లయన్స్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మూడు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా మహరాజస్‌లో గౌతమ్‌ గంభీర్‌, ఊతప్ప, రైనా, కైఫ్‌, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, ప్రవీణ్‌ తాంబే, అశోక్‌ దిండా, శ్రీశాంత్‌, మురళీ విజయ్‌తో పాటు మరికొంత మంది మాజీ టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. ఆసియా లయన్స్‌లో అఫ్రిదీ, దిల్షాన్‌, అక్తర్‌ మిస్బాఉల్‌ హక్‌తో పాటు మరికొంత మంది మాజీ స్టార్లు ఉన్నారు. ఆసియా లయన్స్‌, వరల్డ్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి నిరాశపర్చిన ఇండియా మహరాజాస్‌ జట్టు, మంగళవారం ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపింది. ముఖ్యంగా ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్‌, రాబిన్‌ ఊతప్ప విశ్వరూపం చూపించారు. ఆసియా లయన్స్‌లోని పాక్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. అదరగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసియా లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్‌ తరంగా 69 పరుగులుతో రాణించాడు. దిల్షాన్‌ సైతం 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో అబ్దుల్‌ రజాక్‌ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 రన్స్‌ చేసి అదరగొట్టడంతో ఆసియా లయన్స్‌కు ఆ స్కోర్‌ దక్కింది. ఇండియా మహరాజాస్‌ బౌలర్లో రైనా 2 వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే బిన్నీ, హర్భజన్‌ సింగ్‌, తాంబే తలో వికెట్‌ తీసుకున్నారు. 158 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్‌.. కేవలం 12.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్లు గంభీర్‌, ఊతప్ప పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఊతప్ప 39 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గంభీర్‌ 36 బంతుల్లో 12 ఫోర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గానే నిలిచాడు. 158 లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఓపెనర్లే ఊదిపడేశారు. ఆసియా బౌలర్లలో సోహెల్‌ తన్వీర్‌ 2 ఓవర్లలో 22 పరుగులు, మొహమ్మద్‌ ఆమీర్‌ 3 ఓవర్లలో 29, మొహమ్మద్‌ హఫీజ్‌ 2 ఓవర్లలో 33, అబ్దుల్‌ రజాక్‌ 2 ఓవర్లలో 24, షోయబ్‌ అక్తర్‌ ఒక్క ఓవర్‌లో 12 పరుగులు సమర్పించుకున్నారు. ఇలా ఒక్కప్పటి పాకిస్థాన్‌ సూపర్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను గంభీర్‌-ఊతప్ప జోడీ చీల్చి చెండాడింది. మరి ఈ మ్యాచ్‌పై అలాగే గంభీర్‌-ఊతప్ప బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Finally! The moment, the return, the rise of the Maharajas! 👑💥

India Maharajas won by 10 wickets in an exciting Match Day 4 of the season! 🎊@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/pWyRxxtTxa

— Legends League Cricket (@llct20) March 14, 2023

They came, they fought, they won! 👑@robbieuthappa @GautamGambhir @harbhajan_singh @ParvinderAwana @Bisla36 @IrfanPathan @ImRaina @visitqatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/Qd7b7kzQtd

— Legends League Cricket (@llct20) March 14, 2023

Gambhir and Uthappa chased down 158 in 12.3 overs, to beat Asia Lions by 10 wickets

Scoreboard: https://t.co/8mK10E0Jto#LLCT20 #ALvsIM pic.twitter.com/LHCpPIbrzs

— Cricket Pakistan (@cricketpakcompk) March 14, 2023

Tags :

  • Cricket News
  • Gautam Gambhir
  • LLC 2023
  • Robin Uthappa
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam