క్రికెట్ లో ఆసక్తికరమైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటాయి. కొన్ని వివాదాలకు దారితీస్తే.. మరికొన్ని ఘటనలు ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ తాజాగా ఆస్ట్రేలియా ప్లేయర్ వార్నర్, పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది మధ్య చోటుచేసుకుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో వీరిమధ్య నువ్వా-నేనా అన్నట్లు ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు గొడవపడ్డారా అనేలా అనిపించినా.. అది కేవలం ఫన్నీగా ఉంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో అఫ్రిది వేసిన ఒక ఓవర్ చివరి బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఖవాజా పరుగు తీయడానికి ముందుకు రాగా వార్నర్ గట్టిగా అరిచాడు. ఇదే సమంయలో బంతిని అందుకునేందుకు ఆఫ్రిది, వార్నర్ వైపు దూసుకెళ్లాడు. ఇద్దరు నువ్వెంతా అంటే నువ్వెంతా అనేలా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరు దగ్గరాగా వచ్చి ఒకరి కళ్లలో ఒకరు సీరియస్‌గా చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మొహాల్లో నవ్వులు విరపూశాయి. ఇది చూసిన మిగతా క్రికెటర్లు కూడా వీరి చర్యకు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Some fun banter between Warner vs Shaheen!!!!pic.twitter.com/EuQHjljMSp
— Johns. (@CricCrazyJohns) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.